Bhanupriya:తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయం, నాట్య ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ఆమె.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకున్నారనే ప్రచారం అభిమానుల్లో అనేక సందేహాలకు తావిచ్చింది. ఈ వార్తలపై గతంలో స్పందించిన భానుప్రియ అసలు విషయాన్ని వెల్లడించారు.
సినిమాల్లో భానుప్రియ ప్రస్థానం :
భానుప్రియ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అద్భుతమైన నటనతో పాటు శాస్త్రీయ నృత్యంలోనూ మంచి ప్రావీణ్యం ఉన్న ఆమె.. తనదైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు సినిమాలతో పాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పించారు. ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాల్లో కొనసాగుతున్నారు.
ప్రేమ వివాహం.. భర్తతో అనుబంధం:
భానుప్రియ(Bhanupriya) 1998లో అమెరికాకు చెందిన డిజిటల్ గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత భానుప్రియ కొంతకాలం అమెరికాలోనే నివసించారు. వీరికి అభినయ అనే కుమార్తె ఉంది. తన భర్త నటనతో పాటు నృత్యాన్ని కూడా ఎంతో ప్రోత్సహించేవారని ఆమె గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావడం సహజమని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ALSO READ:Samantha:సమంత బిజినెస్ సీక్రెట్స్ ఇవే.. మహిళలకు ఇచ్చిన సలహాలు వైరల్!
విడాకుల ప్రచారంపై భానుప్రియ క్లారిటీ :
భానుప్రియ తన కుమార్తెతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చి చెన్నైలో నివసించడం ప్రారంభించడంతో ఆమె వైవాహిక జీవితంపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. భర్తకు దూరంగా ఉంటున్నారనే కారణంతో ఇద్దరూ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాన్ని భానుప్రియ ఖండించారు. ఓ మ్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు విడాకులు కాలేదని స్పష్టం చేశారు. తన భర్త గురించి వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని తెలిపారు.
ALSO READ:kiyara advani:బోల్డ్ సీన్స్ పై ట్రోల్ .. కియారా షాకింగ్ కామెంట్స్!
భర్త మరణంతో విషాదంలోకి..:
నిజానికి భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్ 2018లోనే మరణించారు. ఆయన మరణం తర్వాత కూడా విడాకుల గురించి ప్రచారం జరగడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భర్త జీవించి లేరని, ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని వార్తలపై మాట్లాడటం కూడా బాధాకరమని పేర్కొన్నారు. ఇలా భానుప్రియ వ్యక్తిగత జీవితంపై ప్రచారంలో ఉన్న వార్తల వెనుక అసలు విషయాన్ని ఆమె గతంలోనే వెల్లడించారు. సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ సీనియర్ నటి జీవితంలో ఎదురైన వ్యక్తిగత విషాదం అభిమానులను కలచివేస్తోంది.




