Wednesday, November 11, 2026
HomeLATESTAishwarya Lekshmi:జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మలయాళ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

Aishwarya Lekshmi:జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మలయాళ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

Aishwarya Lekshmi:ఐశ్వర్య లక్ష్మి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జిమ్‌లో కార్డియో, డంబెల్ వర్కౌట్స్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు.

on
- Advertisement -banner Ad

Aishwarya Lekshmi:సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో పాటు ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు తమ శరీరాకృతిని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఈ విషయంలో మలయాళ బ్యూటీ, నటి ఐశ్వర్య లక్ష్మి కూడా ముందుంటున్నారు. సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటున్నారు. ఆమె అందం, స్టైలిష్ లుక్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా..:

ఐశ్వర్య లక్ష్మి మొదట మోడలింగ్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆమె అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2017లో విడుదలైన మలయాళ చిత్రం ‘ంజందుకళుడే నత్తిల్ ఒరిడవేళ’ తో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వచ్చిన మాయానది సినిమా ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం వరుసగా అవకాశాలు అందుకుంటూ మలయాళం, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పొన్నియిన్ సెల్వన్, గార్గి, అమ్ము, గట్టా కుస్తీ వంటి సినిమాలు ఆమె కెరీర్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Priya Bhavani Shankar:సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్..!

జిమ్‌లో కష్టపడుతూ ఫిట్‌నెస్‌పై ఫోకస్..:

సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా కనిపించేందుకు ఐశ్వర్య లక్ష్మి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జిమ్‌లో కార్డియో, డంబెల్ వర్కౌట్స్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు. వీటితో పాటు యోగా, వాకింగ్ వంటి వాటికీ ప్రాధాన్యత ఇస్తారు. వర్కౌట్స్ విషయంలో తనకు ట్రైనర్లు ప్రోత్సాహం అందిస్తారని గతంలో ఆమె వెల్లడించారు. బిజీ షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆమె ఫిట్‌నెస్ ప్రయాణం అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Bhanupriya:ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుప్రియ జీవితంలో ఇంత విషాదమా?

అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్..:

ఐశ్వర్య లక్ష్మికి(Aishwarya Lekshmi) దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా మాయానది సినిమాలోని అప్పు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆమె నటన, సహజమైన అందం, విభిన్నమైన పాత్రల ఎంపిక అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే ఫాలోవర్ల సంఖ్యే నిజమైన అభిమానానికి కొలమానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అభిమానుల ప్రేమను స్వాగతిస్తూనే, మార్ఫింగ్ ఫొటోలు, ఏఐతో సృష్టించే అభ్యంతరకరమైన చిత్రాలను తీవ్రంగా తప్పుబట్టారు.

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ..:

2025లో ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా తన ఆలోచనలు, నటనపై దృష్టిని ప్రభావితం చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అందం, ఫిట్‌నెస్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న ఐశ్వర్య లక్ష్మి సినీ ప్రయాణం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రసెంట్ ఐశ్వర్య లక్ష్మి చేతిలో బోలెడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆమె తో సినిమాలు చేయాలని డైరెక్టర్స్ ఎక్కువుగా ఎంట్రెస్ట్ చూపిస్తున్నారు..!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you