Thursday, November 12, 2026
HomeLATESTPooja Hegde:శ్రీలంకలో పూజా హెగ్డే సందడి.. షోరూమ్ ఓపెనింగ్‌లో అదిరిపోయే డ్యాన్స్!

Pooja Hegde:శ్రీలంకలో పూజా హెగ్డే సందడి.. షోరూమ్ ఓపెనింగ్‌లో అదిరిపోయే డ్యాన్స్!

Pooja Hegde:షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పూజా హెగ్డే తనదైన శైలిలో వేడుకకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. తన డ్యాన్స్‌తో స్టెప్పులు, ఉత్సాహభరితమైన హావభావాలు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

on
- Advertisement -banner Ad

Pooja Hegde:టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ పూజా హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతోనే కాకుండా తన గ్లామర్, స్టైలిష్ లుక్స్, డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకునే ఈ బ్యూటీ.. తాజాగా శ్రీలంకలో సందడి చేశారు. అక్కడ జరిగిన ఓ ప్రముఖ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరై వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అంతేకాకుండా తన డ్యాన్స్‌తో అక్కడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.

శ్రీలంకలో పూజా హెగ్డే సందడి :

శ్రీలంక రాజధాని కొలంబోలోని వెల్లవత్తె ప్రాంతంలో నవంబర్ 11, 2026న ‘శ్రీయాని డ్రెస్ పాయింట్’ (Sriyani Dress Point) నూతన ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభమైన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

- Advertisement -
Advertisement

పూజా హెగ్డే రాకతో షోరూమ్ ప్రారంభోత్సవ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆమెను చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

also read:Venky kudumala:తెలుగు సినిమాలు చేయనన్న రష్మిక.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్..!

- Advertisement -
Advertisement

డ్యాన్స్‌తో అదరగొట్టిన బుట్టబొమ్మ :

షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పూజా హెగ్డే (Pooja Hegde)కేవలం అతిథిగా వచ్చి వెళ్లిపోకుండా తనదైన శైలిలో వేడుకకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. తన డ్యాన్స్‌తో అక్కడి వారిని అలరించారు. ఆమె స్టెప్పులు, ఉత్సాహభరితమైన హావభావాలు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజా డ్యాన్స్ చేస్తున్న సమయంలో అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

ముఖ్యంగా తెరపై తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే పూజా.. మరోసారి తన డ్యాన్స్ ప్రతిభను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల ఆసక్తిని పెంచుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Babu mohan:ప్యారడైజ్ టీమ్ నన్ను మోసం చేసింది.. అందుకే ఫ్లాప్.. బాబు మోహన్ కామెంట్స్..!

సినిమాలతో పాటు బ్రాండ్ ఈవెంట్లలోనూ..:

పూజా హెగ్డే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌లోనూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

సినిమాలతో బిజీగా ఉంటూనే వివిధ బ్రాండ్ ప్రమోషన్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల్లోనూ పూజా పాల్గొంటున్నారు. తాజాగా శ్రీలంకలో జరిగిన శ్రీయాని డ్రెస్ పాయింట్ ఫ్లాగ్‌షిప్ షోరూమ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొనడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తన రాకతో పాటు డ్యాన్స్‌తోనూ ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన హీరోయిన్ పూజా హెగ్డే గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె అపీరియన్స్ ఎంత హైలెట్ అవుతుందో గుర్తు చేసుకుంటున్నారు. దట్ ఈజ్ బుట్టబొమ్మ అంటూ పొగిడేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you