Friday, November 20, 2026
HomeLATESTAnushka Shetty:హైదరాబాదులో ఇల్లు అమ్మేసిన అనుష్క శెట్టి.. పెళ్లి కోసమేనా..?

Anushka Shetty:హైదరాబాదులో ఇల్లు అమ్మేసిన అనుష్క శెట్టి.. పెళ్లి కోసమేనా..?

Anushka Shetty: ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి హైదరాబాదులో ఉన్న ఇంటిని కూడా అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Anushka Shetty:ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న అనుష్క.. తన కెరియర్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది అనుష్క. అంతేకాకుండా బాహుబలి వంటి చిత్రాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క శెట్టి.. తమిళ చిత్రాలలో కూడా నటించింది. 2018లో భాగమతి సినిమా తర్వాత మళ్లీ పెద్దగా సినిమాలలో కనిపించలేదు. సుమారుగా ఈ ఎనిమిదేళ్ల కెరియర్ లోనే కేవలం చేసింది రెండు,మూడు చిత్రాలు మాత్రమే.. అందులో కూడా ఒక సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది.

అభిమానులకు షాక్ ఇచ్చిన అనుష్క..

ఎందుకో ఈ మధ్యకాలంలో అనుష్క శెట్టి (Anushka Shetty)పెద్దగా సినిమాలలో కనిపించలేదనే విధంగా అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించదు అనుష్క.. గడిచిన రెండు మూడు చిత్రాల ప్రమోషన్స్ కి కూడా పెద్దగా బయట కనిపించలేదు. దీంతో అనుష్క జనాలలో, మీడియాలో చూసి దాదాపుగా అభిమానులు ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఇటువంటి సందర్భంలోనే ఫ్యాన్స్ కి మరొక బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Hyper Aadi:రోజాతో హైపర్ ఆదికి విభేదాలు..స్టేజీ పైనే ఇచ్చి పడేశాడుగా..!

హైదరాబాదులో సొంత ఇంటిని అమ్మేసిన అనుష్క..

అదేమిటంటే తాజాగా అనుష్క టాలీవుడ్ సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్క ప్రస్తుతం తన సొంత ఊరులోనే ఉంటుందని, ఇటీవల హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఇంటిని కూడా అమ్మేసినట్లు వినిపిస్తున్నాయి.. గతంలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న అనుష్క.. తెలుగులో వరుస సినిమాలను చేస్తూ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లో ఒక ఇంటిని కొనుక్కొని మరి ఉండేది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరం అవడం, హైదరాబాద్కు రావడం తగ్గించడం, ఆ ఇంటిని రెంట్ కి ఇవ్వడం వంటివి జరిగాయి. కానీ ఇప్పుడు తాజాగా ఆ ఇంటిని కూడా అమ్మేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇప్పుడు ఆ ఇంటిని భారీ ధరకు అమ్మేసినట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Gopichand;మహేష్ బాబు కి విలన్ గా చేయాల్సిన గోపీచంద్.. చెడ దొబ్బింది ఎవరంటే?

టాలీవుడ్ కి దూరం కాబోతోందా?

ఇకమీదట అనుష్క పూర్తిగా సినిమాలు మానేయబోతోందని.. అదంతా కూడా పెళ్లి కోసమే అన్నట్లుగా మరికొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తన సొంత ఊరు మంగళూరులోని అనుష్క సెటిల్ అయ్యేలా ప్లాన్ చేస్తోందని వినిపిస్తున్నాయి. మరి పెళ్లి విషయంలో కూడా వినిపిస్తున్న రూమర్స్ ఎంత మటుకు నిజమో తెలియాల్సి ఉంది. అనుష్క ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. అలాగే యువి క్రియేషన్ బ్యానర్ పైన మరొక సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు.

- Advertisement -
Advertisement

మరి పెళ్లెప్పుడు?

ఇలా ఒక వైపు సినిమాలు చేయకపోవడం.. హైదరాబాదులో ఉన్న ఇల్లును కూడా అమ్మేయడంతో అనుష్క శెట్టి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి నిశ్చయించుకుందని.. అందుకే తాను ఇలా చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అనుష్క వయసు కూడా 45 సంవత్సరాలు , మరి ఈ ఏడాది గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you