Friday, November 20, 2026
HomeLATESTRashmi Gautam: నా ఫ్యామిలీ చచ్చినా పర్లేదు.. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్..!

Rashmi Gautam: నా ఫ్యామిలీ చచ్చినా పర్లేదు.. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్..!

Rashmi Gautam: ప్రముఖ యాంకర్ కం నటి రష్మీ గౌతమ్ తాజాగా వెంటనే ప్రక్షాళన జరిగిపోవాలి పెద్ద విపత్తు రావాలి అందులో నా కుటుంబం చనిపోయిన పర్లేదు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది.

on
- Advertisement -banner Ad

Rashmi Gautam: తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకొని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ అయ్యింది యాంకర్ రష్మీ. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో చేసే స్కిట్స్ కానీ , సాంగ్స్ కి కానీ మంచి పాపులారిటీ రావడంతో ఈ జోడీకి మరింత క్రేజ్ పెరిగింది బుల్లితెర పైన. కొన్ని సందర్భాలలో ఈ జంటను చూసి వివాహం చేసుకుంటారేమో అని అనుమానాలు కూడా అభిమానులలో మొదలయ్యాయి. కానీ తామిద్దరం కేవలం స్నేహితులుము అంటూ తెలియజేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరు కలిసి కనిపించకపోయినా వివిధ షోలలో యాంకర్ గా చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

వెంటనే ప్రక్షాళన జరిగిపోవాలి – రష్మీ

యాంకర్ రష్మీ నిరంతరం ఎప్పుడూ కూడా సమాజంలో జరిగే కొన్ని సంఘటనల పైన అలాగే జంతువుల పైన జరిగే ఎటువంటి దాడి గురించి కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నో సందర్భాలలో తెలియజేసింది. కానీ ఇప్పుడు తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయగా అది అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.. రష్మీ జంతు ప్రేమికురాలు వాటి మీద ఏదైనా జరిగితే చాలు తీవ్రంగా ఆవేదనను వ్యక్తం చేస్తూ స్పందిస్తుంటుంది.

- Advertisement -
Advertisement

also read: Monalisa:కుంభమేళ మోనాలిసా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

అందులో నా కుటుంబం పోయినా పర్లేదు..

చతిస్గడ్ రాష్ట్రంలో కొంతమంది చిన్నారులు కలిసి ఆరు అమాయక కుక్క పిల్లలను అత్యంత కిరాతకంగా నిప్పు పెట్టి మరి సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారడంతో రష్మిక ఆ వీడియో పైన స్పందిస్తూ.. దేవుడా దయచేసి భయంకరమైన ప్రకృతి విపత్తు పంపించు.. అందులో నా కుటుంబం నాకు ఇష్టమైన వాళ్ళు బలైపోయినా కూడా నేను పట్టించుకోను.. ఈ భూమి పైన ఒక ప్రక్షాళన జరగాలి అది మనకు అత్యవసరంగా కావాలి అంటూ తన మనసులో ఉన్న ఆవేదనను అక్షర రూపంలో బయట పెట్టింది యాంకర్ రష్మీ. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన పోస్ట్ సైతం వైరల్ గా మారింది. ఈ విషయంలో రష్మీకి మద్దతుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read: Arjun Sarja:హీరో అర్జున్ సర్జా కూతురికి విడాకులా..?

రష్మి సినిమా కెరియర్..

ముఖ్యంగా మూగజీవాల పట్ల ఇలా అత్యంత క్రూరంగా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతుంటారు. రష్మీ ఇప్పుడే కాదు ఎన్నో సందర్భాలలో కూడా స్పందిస్తూ వస్తోంది. 2022లో హోలీ అనే సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన రష్మి ఆ తర్వాత 2006లో కరెంట్ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత ప్రస్థానం, గురు, గుంటూరు టాకీస్, అంతం, నెక్స్ట్ నువ్వే, బొమ్మ బ్లాక్ బాస్టర్ తదితర చిత్రాలలో నటించింది. చివరిగా 2023లో హాస్టల్ బాయ్స్ అనే చిత్రంలో నటించిన రష్మి.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, యాంకర్ గా కొనసాగుతానని తెలియజేసింది. ప్రస్తుతం అయితే త్రిశంకు అనే చిత్రంలో నటిస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you