Friday, November 20, 2026
HomeLATESTPujitha ponnada:ఆదర్శకుటుంబం టీమ్ మోసం చేసిందని ఆరోపణలు చేస్తున్న నటి పూజిత..!

Pujitha ponnada:ఆదర్శకుటుంబం టీమ్ మోసం చేసిందని ఆరోపణలు చేస్తున్న నటి పూజిత..!

Pujitha ponnada: ప్రముఖ నటి పూజిత పొన్నాడ ఆదర్శ కుటుంబం టీం తనను మోసం చేసింది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Pujitha ponnada:డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించగా.. నివేద పేతురాజ్, నారా రోహిత్ కీలకమైన పాత్రలో కనిపించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ , ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడం, డార్క్ క్రైమ్ థ్రిల్లర్గా చూపించడం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటువంటి సందర్భంలోనే నటిగా పేరు సంపాదించిన పూజిత పొన్నాడ సినిమా టీం పైన పలు సంచలన ఆరోపణలు చేసింది.

ఆదర్శ కుటుంబం టీం నన్ను మోసం చేసింది..

ఆదర్శ కుటుంబం సినిమాలో తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించిన పూజిత కీలకమైన పాత్రలో కనిపించబోతోందని గతంలో వార్తలు వినిపించాయి. నారా రోహిత్ కు జోడిగా ఈమె నటించబోతుందని వినిపించాయి. అయితే సినిమాలో పూజితను కేవలం ఒకే ఒక సీన్ కి పరిమితం చేశారని, అది కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో చూపించారని, ఈ పాత్ర కోసం అసలు పూజితను ఎందుకు తీసుకున్నారు అంటూ పలువురు నెటిజన్స్ సైతం మాట్లాడుకున్నారు.

- Advertisement -
Advertisement

ఒక షెడ్యూల్ పూర్తయ్యాక పక్కన పెట్టేశారు..

ఈ సినిమా విషయంలో తాజాగా తనకు అన్యాయం జరిగిందంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. 2025లో తాను యూకే లో ఉన్నానని, అప్పుడు ఆదర్శ కుటుంబం అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేశారని, త్రివిక్రమ్ సినిమాలో ఒక పాత్ర ఉందని ఆఫీస్కి రమ్మని చెప్పారు. త్రివిక్రమ్ సినిమా అనగానే తాను కూడా చాలా ఆనందపడ్డాను. జనవరి 3న హైదరాబాద్ కి వచ్చి మరి ఆడిషన్ ఇచ్చాను. అందులో రకరకాల ఫోటోషూట్లలో షూట్ చేశారని. చివరికి త్రివిక్రమ్ చూసి వాటిని ఫైనలైజ్ చేశారని, ఆ తర్వాత ఒకటిన్నర గంట పాటు తనకు కథ చెప్పారు. నా పాత్ర గురించి చెప్పారు.. అందులో మొదటి నుంచి ఎండింగ్ వరకు తన పాత్ర ఉంది ఇంత మంచి పాత్ర దొరకడం చాలా ఆనందంగా అనిపించి ఫీలయ్యానని తెలిపింది..

also read: Arjun Sarja:హీరో అర్జున్ సర్జా కూతురికి విడాకులా..?

- Advertisement -
Advertisement

సినిమా చూశాక నేనే షాక్ అయ్యాను..

కానీ ఒక షెడ్యూల్లో ఐదు రోజులపాటు సినిమా షూటింగ్ చేసి నారా రోహిత్, నా పైన ఉండే సీన్స్ చిత్రీకరించారు. ఆ తర్వాత మూడు నెలల పాటు రెండవ షెడ్యూల్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో చాలా రూమర్స్ వినిపించాయి .కథలో మార్పులు జరిగాయని విన్నాను చాలామంది పాత్రలను చేంజ్ చేస్తున్నారని విన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఆ తర్వాత నాకు షూటింగ్ నుంచి పిలుపు రాలేదు. నేను దుబాయ్ కి వెళ్లే ప్లాన్ లో ఉన్నాను. షూటింగ్ మొదలవుతే ఇబ్బంది అవుతుందని మరోసారి అసిస్టెంట్ డైరెక్టర్ కి ఫోన్ చేశాను అప్పుడు కూడా రెస్పాండ్ కాలేదని.. మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేయక తన షూటింగ్ లేదని చెప్పారు..

also read: Rashmi Gautam: నా ఫ్యామిలీ చచ్చినా పర్లేదు.. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్..!

- Advertisement -
Advertisement

ఇంత మోసం చేస్తారు అనుకోలేదు..

దీంతో ఆదర్శ కుటుంబం సినిమాలో నా పాత్ర లేదని చెప్పారు కానీ ఆ పాత్ర కోసం వేరే నటిని తీసుకున్నారని తెలిసింది.. సినిమా విడుదలయ్యాక నాకు మరో షాక్ తగిలింది. ఆ సినిమాలో తనకి సంబంధించి ఒక సీన్ లో మాత్రమే కనిపించాను. నేను ఉన్నట్లు క్రెడిట్ కూడా ఇవ్వలేదు సినిమా కోసం నన్ను వాడుకున్నారు అంటూ పూజిత ఆవేదనతో మాట్లాడింది..

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you