Aamani Actress:టాలీవుడ్ సీనియర్ నటి ఆమని ప్రస్తుతం బుల్లితెరపై వరుస సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సినిమాల్లోనూ అప్పుడప్పుడు కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె వెల్లడించారు. ముఖ్యంగా తన జీవితంలో తీసుకున్న ఓ నిర్ణయం గురించి ఆమని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
కెరీర్ పీక్‌లో పెళ్లి.. అదే పెద్ద తప్పు :
తన సినీ కెరీర్ మంచి స్థాయిలో కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పిదమని ఆమని తెలిపారు. ఇది పూర్తిగా లవ్ మ్యారేజ్ కాదని, ఇరు కుటుంబాల అంగీకారంతో జరిగిన ‘లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్’ అని ఆమె వివరించారు. తమిళ చిత్ర నిర్మాత కాజా మైదీన్‌ను వివాహం చేసుకున్న ఆమని.. ఆయనతో సుమారు ఏడెనిమిదేళ్లు కలిసి జీవించినట్లు చెప్పారు.
సినిమాలకు దూరం కావడమే సమస్య :
పెళ్లి తర్వాత కొంతకాలం తన భర్తను మంచి భర్తగా, మంచి మనసున్న వ్యక్తిగా భావించానని ఆమని తెలిపారు. అయితే తాను తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు సమస్యలు మొదలయ్యాయని చెప్పారు. సినిమాల్లో నటించేందుకు భర్త అంగీకరించలేదని, ‘సినిమాలు చేయొద్దు’ అని చెప్పారని ఆమె వెల్లడించారు.
సినిమా తనకు ఎంతో ఇష్టమని, ఎన్నో మంచి పాత్రలు చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నానని ఆమని పేర్కొన్నారు. అలాంటి సమయంలో సినిమాలకు దూరంగా ఉండాల్సి రావడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. భర్త కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ, తనను తిరిగి సినిమాల్లోకి ఎందుకు పంపించలేదో అర్థం కాలేదని ఆమని( Aamani Actress) అన్నారు.
also read:Srikanth Odela:సుకుమార్ ఆఫీస్ గేటు దగ్గర 4 ఏళ్లు.. శ్రీకాంత్ ఓదెల సంచలన విషయాలు!
అమ్మ ముందే హెచ్చరించింది :
పెళ్లికి ముందు నుంచే తన తల్లి ఈ వివాహం విషయంలో కొంత వ్యతిరేకంగా ఉన్నారని ఆమని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ‘సినిమాలు చేయకూడదు’ అనే షరతును అంగీకరించడం తనకు సరైన నిర్ణయంగానే అనిపించిందని, కానీ తర్వాత అదే నిర్ణయం తప్పుగా అనిపించిందని ఆమె తెలిపారు.
also read:Singeetham Srinivas Rao:సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..!
పదేళ్లుగా విడిగా.. పిల్లలే ప్రపంచం:
వివాహ బంధం నుంచి విడిపోయి పదేళ్లు పూర్తయ్యాయని ఆమని చెప్పారు. ఆరేడేళ్ల వైవాహిక జీవితంలో తాను ఒంటరితనాన్ని అనుభవించానని, భర్త తన ప్రొడక్షన్ పనుల్లో ఎక్కువగా బిజీగా ఉండేవారని తెలిపారు. తమకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని.. వారే ప్రస్తుతం తన ప్రపంచమని ఆమని స్పష్టం చేశారు.
తన భర్త కూడా మరో వివాహం చేసుకోలేదని, ఆయనకూ పిల్లలే ప్రపంచమని చెప్పారు. అయితే తనకు సినిమానే మరో ప్రపంచమని ఆమని అభిప్రాయపడ్డారు. కెరీర్‌పై తనకున్న ప్రేమను, వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా పంచుకున్నారు.




