Tuesday, September 29, 2026
HomeLATESTSrikanth Odela:ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్.. కుక్క సీన్‌పై శ్రీకాంత్ ఓపెన్ కామెంట్స్!

Srikanth Odela:ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్.. కుక్క సీన్‌పై శ్రీకాంత్ ఓపెన్ కామెంట్స్!

Srikanth Odela: కుక్క సీన్‌పై జరుగుతున్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఎంత హైలెట్ చేస్తున్నారో తెలిసిందే. దానిపై కూడా శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు.

on
- Advertisement -banner Ad

Srikanth Odela:ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నాని నటించిన “ది ప్యారడైజ్” గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది. నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. నెగిటివ్‌గా ట్రోలింగ్ చేస్తున్నారు. దానిని హీరో, డైరెక్టర్ కూడా ఒప్పుకున్నారు. సినిమాలో అక్కడక్కడ లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేసుకుంటామని, నెక్స్ట్ వచ్చే సినిమాలో ఆ తప్పులు దొరకకుండా చూసుకుంటామని ఓపెన్‌గానే స్పందించారు.

అయినా సరే కొన్ని కొన్ని మీమ్ పేజెస్ మాత్రం నానిని, అదేవిధంగా శ్రీకాంత్‌ను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ది ప్యారడైజ్ సినిమాలోని కొన్ని సీన్స్‌లో లాజిక్ ఏ లేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

కుక్క సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ :

దీనిపై కూడా చిత్ర బృందం స్పందించింది. సినిమా రిలీజ్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీకాంత్(Srikanth Odela) మాట్లాడుతూ.. నా ఆలోచనలను ఆ సీన్స్‌లో కరెక్ట్‌గానే చూపించాను. కానీ ఆ ఎమోషన్ తెరపై సరిగ్గా కనెక్ట్ అయ్యేలా కన్వే చేయలేదేమో. అందువల్లే సినిమాకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అంటూ శ్రీకాంత్ నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు.

అంతేకాదు ఈ సినిమాలోని ఒక సీన్‌పై జరుగుతున్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఎంత హైలెట్ చేస్తున్నారో తెలిసిందే. దానిపై కూడా శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు.

- Advertisement -
Advertisement

హీరోను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆ కుక్క జీప్ వెనకాల పరిగెడుతుంది. హీరో జైలు గోడకు అటువైపు ఉంటే, కుక్క మాత్రం ఇటువైపు ఉండిపోతుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. వాడు ఎప్పుడు బయటకు వస్తాడు అని ఎదురుచూసే ఆ కుక్క ఎమోషనల్ సీన్. హీరోతో పాటే అది కూడా పరిగెడుతుందనేది అసలు ప్లాన్ అదే విధంగా రాసుకున్నారట.

పేపర్‌పై ఉన్న డెప్త్ స్క్రీన్‌పైకి రాలేదు :

అయితే ఆ ప్రయాణాన్ని, ఆ బాండింగ్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదేమో. దాని వల్లే ఎన్ని ట్రోల్స్ వచ్చాయేమో. అందుకే ఆ సీన్ పండలేదేమో అన్న ఫీల్ శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

- Advertisement -
Advertisement

అంతేకాదు ఒకవేళ ఆ డిటైలింగ్ అంతా కూడా బాగా వచ్చి, ఆడియన్స్‌కు అర్థమయ్యేలా కట్ చేసి ఉంటే కచ్చితంగా సినిమా లెవెల్ వేరేలా ఉండేది. కనీసం ఆ కుక్క సీన్ అయినా ఒక మిరాకిల్‌గా గుర్తుండిపోయేది. సహజమైన ప్రేమను కుక్క ఎలా చూపిస్తుంది అనేది చూపించాలి అనుకున్నాను అని చెప్పుకొచ్చారు.

పేపర్ మీద ఉన్న డెప్త్ స్క్రీన్ మీదకు రావడం కొంచెం తడబాటు జరిగింది. ఒకవేళ అది వచ్చి ఉంటే సినిమా వేరే లెవెల్‌లో హిట్ అయి ఉండేది అంటూ శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

also read:Prabhas:సినీ చరిత్రలో కని విని ఎరుగని క్రేజీ కాంబో మావ ఇది ..!

మగధీర సీన్‌ను గుర్తు చేసుకున్న శ్రీకాంత్ ;

అంతేకాదు ఇదే సమయంలో తాను చూసిన మగధీర సినిమాలోని ఒక సీన్ గుర్తు చేసుకున్నారు. మగధీరలో హీరో బాద్షా అనగానే గుర్రం ఎగరేసే మూమెంట్ చాలా చాలా నచ్చేసింది. సినిమా థియేటర్‌లో ఆ సీన్ చూసినప్పుడు పిచ్చెక్కిపోయాను. అలాగే ఇలా కూడా రాసుకున్నాను. బట్ వర్కౌట్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు.

అదే మూమెంట్‌లో హీరో నాని కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. సినిమాను ఎక్కువగా లాజికల్ ప్రకారం చూస్తే భావోద్వేగాలకు కనెక్ట్ అవ్వవు అంటూ సమర్థించుకున్నారు.

also read:Rakul Preet Singh:బాలీవుడ్‌లో కలకలం.. రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీపై ఐటీ రైడ్స్!

నెక్స్ట్ సినిమాలో తప్పులు రాకుండా చూసుకుంటాం :

అయితే ఆడియన్స్ నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌పై మాత్రం ఏమాత్రం నెగిటివ్‌గా స్పందించలేదు. మా నెగిటివ్స్ ఏంటో మేము తెలుసుకున్నాం. నెక్స్ట్ సినిమాలో అవి రాకుండా చూసుకుంటామని అన్న విధానం ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. దట్ ఈజ్ నేచురల్ స్టార్ అంటూ తెగ పొగిడేస్తున్నారు అభిమానులు.

అయితే ది ప్యారడైజ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన టాక్ ను దక్కించుకోవడం కొంచెం నాని కెరీర్‌కు మైనస్‌గా మారింది అంటున్నారు సినీ ప్రముఖులు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you