Telugu Cinema:ఒకప్పుడు సినిమా అంటే ఒక ఎమోషన్, ఒక ఎంటర్టైన్మెంట్. మనసులోని బాధంతా మరిచిపోయి ఒక మూడు గంటల పాటు హాయిగా, ప్రశాంతంగా నవ్వుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక సినిమా చూస్తే దానికి సంబంధించి ఏదో ఒక మంచి మెసేజ్ సమాజానికి వస్తుంది అనే అభిప్రాయం అందరికీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అది పూర్తిగా మారిపోయింది. సినిమాని ఎందుకు తెరకెక్కిస్తున్నారో, ఎలా తెరకెక్కిస్తున్నారు, ఏ పర్పస్ కోసం తెరకెక్కిస్తున్నారో అర్థం కాని పరిస్థితి తయారైంది.
సినిమాలపై నెగిటివ్ రివ్యూలు.. ట్రోలింగ్ :
ఇదే ఒక తలనొప్పి అనుకుంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని కావాలని కొంతమంది పని కట్టుకొని నెగిటివ్ రివ్యూలు, సినిమాని ట్రోల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ గోల ఓవర్‌గా లిమిట్స్ దాటిస్తుంది. మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో చాలా చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా నాని ‘ది ప్యారడైజ్’కి సంబంధించి ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్స్ విన్నామో తెలిసిందే. కొంతమంది సినిమా బాగుంది అంటారు. మరి కొంతమంది బాగోలేదు అంటారు. మరి కొంతమంది మాత్రం కావాలని పని కట్టుకొని మరీ ఆ సినిమాను ట్రోల్ చేయడానికి కాచుకొని కూర్చుంటారు.
‘టాక్సిక్’ సినిమా తర్వాత సోషల్ మీడియాలో సవాళ్లు :
‘టాక్సిక్’ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామందికి ఆ సినిమా నచ్చలేదు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే కొంతమంది ‘టాక్సిక్’ సినిమా బాగుంది అని, కావాలనే తెలుగు జనాలు ‘టాక్సిక్’ సినిమాను రిజెక్ట్ చేశారు అని, నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వచ్చినా సరే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చేసి చూపిస్తామంటూ ఓపెన్‌గా సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసిరారు.
అనుకున్నట్టే నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై నెగిటివ్ రివ్యూస్ వచ్చి, ఆ సినిమా (Telugu Cinema)భారీ దెబ్బ పడిపోయే రేంజ్లో ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు నాని సినిమా అయిపోయాక నెక్స్ట్ రాబోయే సినిమాలపై ఆ ప్రభావం పడబోతున్నట్లు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో తెలుస్తుంది.
also read:Bigg Boss Telugu 10:బిగ్ బాస్‌లో ముఖేష్ సంచలన నిర్ణయం..ఊహించని ట్విస్ట్!
విజయ్ దేవరకొండ సినిమాపై కూడా ట్రోలింగ్? :
విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని కూడా అట్టర్ ఫ్లాప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్-అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేసి పెడతామంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. దీనితో ఫ్యాన్స్ కూడా అక్టోబర్‌లోకి వచ్చారు.
also read:Jailar 2: భారీ ధరకు జైలర్ 2 సినిమా.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?
కంటెంట్ ఉంటే హిట్.. లేకపోతే ఫ్లాప్ అంటున్న అభిమానులు:
ఎవరు ఎన్ని చేసినా సరే, తెలుగు సినిమాలో కంటెంట్ ఉంటే అది హిట్ అవుతుంది, లేకపోతే అది ఫ్లాప్ పోతుంది. మా సినిమా ఫ్లాప్ అయినా మేము బాధపడతాం, కంటెంట్ ఉన్న సినిమా హిట్ అయితే ఆనందపడతామంటూ తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే రాబోయే సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది…..?




