Tuesday, September 29, 2026
HomeLATESTJailar 2: భారీ ధరకు జైలర్ 2 సినిమా.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?

Jailar 2: భారీ ధరకు జైలర్ 2 సినిమా.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?

Jailar 2: జైలర్ టు తెలుగు సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినా.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Jailar 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 సినిమా రాబోతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు సన్ పిక్చర్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి పలు రకాల అప్డేట్లను కూడా వరుసగా విడుదల చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

భారీ ధరకు అమ్ముడుపోయిన తెలుగు రైట్స్..

తాజాగా తెలుగు సినిమా ధియేటర్ రైట్స్ విషయంలో వినిపిస్తున్న వార్తలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 4 రెట్లు ఎక్కువ ధరకు తెలుగు సినిమా రైట్స్ అమ్ముడుపోవడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ విషయం సరికొత్త చర్చకు దారితీసింది. రోబో సినిమా తర్వాత రజనీకాంత్ కి సరైన సక్సెస్ అందుకోలేదు. కానీ జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రజనీకాంత్.. ఈ సినిమా 12 కోట్ల రూపాయలకు విక్రయించగా, ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం కావడంతో పాటుగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో బయ్యర్లకు నాలుగు రెట్ల లాభాలను కూడా అందించిన చిత్రంగా ఉంది.

- Advertisement -
Advertisement

also read:prudhvi raj:”జబర్దస్త్ లో జరిగేదంతా మోసం,దగా”.. షాకింగ్ మ్యాటర్ బయటపెట్టిన కామెడీయన్..!

జైలర్ 2 రైట్స్ కి ఊహించని డిమాండ్..

ఇదే సక్సెస్ టాక్ తో ఇప్పుడు జైలర్ 2(Jailar 2) సినిమా రైట్స్ కి ఊహించిన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ 45 కోట్ల రూపాయల వరకు తెలుగు రైట్స్ ని దక్కించుకున్నట్లు వినిపిస్తున్నాయి. దీంతో మొదటి భాగానికి పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఇది సుమారుగా నాలుగింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. దసరా పండుగ బరిలో జైలర్ 2, రణబాలి, ఆదర్శ కుటుంబం వంటి క్రేజీ చిత్రాలు బాక్సాఫీసు వద్ద విడుదల కాబోతున్నాయి.. ఈ చిత్రాలను ఢీకొట్టాలి అంటే కచ్చితంగా ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే సరిపోదు అంతకుమించి హిట్ వచ్చేలా ఉండాలి.

- Advertisement -
Advertisement

also read:Suriya:సూర్యతో సినిమా.. స్టేజీపై రాజమౌళి అన్ ఎక్స్పెక్టెడ్ కామెంట్స్..!

ఆ టార్గెట్ అందుకోవడం కష్టమేనా?

45 కోట్ల రూపాయల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని జైలర్ 2 అందుకోవడం అంటే.. అది చాలా కష్టమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. జైలర్ తర్వాత వచ్చిన వేట్టయాన్, కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. మరి ఇప్పుడు జైలర్ 2 సినిమాతో రజినీకాంత్ ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సుమారుగా 250 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వినిపిస్తున్నాయి. జైలర్ సినిమాకి కేవలం 122 కోట్ల రూపాయలకు రైట్స్ అమ్ముడుపోగా.. 295 కోట్ల రూపాయల షేర్, 606 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్ పైన కోలీవుడ్ లో కూడా ఒక సరికొత్త సెంటిమెంట్ వినిపిస్తోంది. అదేమిటంటే గతంలో భారతీయుడు 2, పందెంకోడి 2, సర్దార్ 2, చంద్రముఖి 2 వంటి సీక్వెల్స్ కి పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయాయి. మరి జైలర్ 2 పరిస్థితి ఏంటో తెలియాలి అంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you