Prabhas:సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా, కొత్త కొత్త కాంబినేషన్లలో తెరపైకి వస్తున్నా సరే.. క్రేజీ క్రేజీ కాంబో కోసం జనాలు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్‌కి సంబంధించిన సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పాన్ ఇండియా స్టార్స్ డిఫరెంట్ కాంబోని సెట్ చేసుకుంటే చూడాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ డిఫరెంట్ కాంబినేషన్లలో సినిమాలు చేయాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే ప్రభాస్ :
అలాంటి కోరికలను ప్రభాస్(Prabhas) ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కి తీర్చేస్తూ ఉంటారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి డైరెక్టర్‌తో ఆయన సినిమా ఓకే చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ ఉంటారు. సినిమా హిట్ ఆఫర్‌నా అన్నది పక్కన పెడితే, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది అంటున్నారు అభిమానులు.
తాజాగా మరొకసారి అలాంటి బిగ్ రిస్క్ చేయబోతున్నాడు ప్రభాస్ అన్న న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రభాస్ మరోసారి కొత్త కాంబినేషన్ తెరపైకి తీసుకురాబోతున్నాడు అన్న న్యూస్ తెలుగు ఫిలిం వర్గాలలో ట్రెండ్ అవుతుంది.
also read:Rakul Preet Singh:బాలీవుడ్‌లో కలకలం.. రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీపై ఐటీ రైడ్స్!
కార్తీక్ ఘట్టమనేనితో ప్రభాస్ సినిమా? :
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. కార్తీక్ ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సినిమాలే కాని, తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం అని చెప్పాలి. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని కొత్త జోనర్‌తో ఆయన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. కార్తీక్ ఘట్టమనేని అంటే ఒక స్పెషల్ డైరెక్టర్ అన్న బిరుదు ఎప్పటినుంచో ఉంది.
అలాంటి డైరెక్టర్‌తో ఇప్పుడు ప్రభాస్ సినిమా చేయబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని ప్రభాస్‌కి బిగ్ ఫ్యాన్. అంతేకాదు, ఆయనతో సినిమా చేయాలి అంటూ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.
also read:Telugu Cinema:”ప్యారడైజ్” పని అయిపోయింది.. నెక్స్ట్ టార్గెట్ ఆ రెండు సినిమాలే!
ప్రభాస్‌కు కథ వినిపించిన కార్తీక్?
ప్రభాస్‌కి ఒక స్టోరీ వినిపించగా అది ఫుల్ సక్సెస్ అయింది అని, ప్రభాస్ ఇంప్రెస్ అయిపోయాడు అని, ప్రభాస్ అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసేశాడు అని న్యూస్ వినిపిస్తుంది. కానీ ఇది కార్యరూపం దాల్చడానికి ఇంకొంత టైం పడుతుంది అని, ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఆలస్యం కావచ్చు అని సోషల్ మీడియాలో న్యూస్ ట్రెండ్ అవుతుంది.
ఈ కాంబోపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు :
కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ప్రభాస్ సినిమా రావడమే ఒక అదృష్టం. అది ఎప్పుడు వస్తే మేము కచ్చితంగా సినిమా హిట్ చేస్తామంటున్నారు ఫ్యాన్స్. ఇలాంటి ఒక కాంబో సినీ చరిత్రలోనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్, అలాగే కార్తీక్ ఘట్టమనేని పేర్లను ట్రెండ్ చేస్తున్నారు.




