Suriya:కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో సూర్య అలాగే తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఒక్కటైన సినిమా రావాలి అంటూ కొన్ని సంవత్సరాల నుంచి బోలెడు మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కేవలం సూర్య అభిమానులు మాత్రమే కాదు, చాలామంది కామన్ పీపుల్స్, సినీ స్టార్ సెలబ్రిటీస్ కూడా వీళ్ల కాంబోలో సినిమా పడాలి అంటూ వెయిట్ చేస్తున్నారు. అందుకే ఏ ఈవెంట్లో, ఏ ఫంక్షన్లో రాజమౌళి కనపడినా లేకపోతే సూర్య కనపడినా వీళ్ల కాంబో గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు.
సూర్యతో సినిమా ఎప్పుడు..? :
తాజాగా అలాంటి సిచువేషన్ మళ్లీ ఎదురైంది. మలయాళీ స్టార్ నటుడు ఫాహెద్ ఫజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ తెలుగు సినిమా ‘డోంట్ ట్రబుల్ దట్ ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఆయన కుమారుడు కార్తికేయ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.
సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర బృందం బిజీబిజీగా గడిపేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ట్రెండ్ అవుతున్నాయి.
స్టేజ్‌పైకి సినిమా గురించి మాట్లాడడానికి వచ్చిన రాజమౌళిని యాంకర్ ‘సూర్య(Suriya) గారితో మీ సినిమా ఎప్పుడు ఉంటుంది?’ అనే విధంగా ప్రశ్నించింది. దీంతో వెంటనే రాజమౌళి చాలా చాకచక్యంగా మాట్లాడారు.
also read:Nani The Paradise:ప్యారడైజ్ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!
రాజమౌళి చాకచక్యమైన సమాధానం :
“నాకు తెలుసు. ఈ ఈవెంట్‌కి నేను, సూర్య వస్తున్నారు అంటే కచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతారని గెస్ చేశాను. ఆన్సర్ కూడా రెడీ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఈ ఈవెంట్లో సూర్య నా కాంబో గురించి మాట్లాడితే మేము హెడ్‌లైన్స్‌గా మారిపోతాం. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే సినిమా సబ్హెడ్లైన్గా మారిపోతుంది. అలాంటి ఛాన్స్ నేను ఇవ్వను.
మేము ఏదైనా సినిమా చేయాలి అనుకున్నప్పుడు మేమే ఈవెంట్ పెట్టి అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మా గురించి పక్కన పెట్టి ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే సినిమా గురించి మాట్లాడటం చాలా ఇంపార్టెంట్” అంటూ చాకచక్యంగా ఆ ప్రశ్న నుంచి తప్పించుకున్నారు.
also read:Sampoornesh Babu: స్టేజ్ పైన సంపూర్ణేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..!
సూర్యతో సినిమా ఉంటుందా..?:
కానీ వీళ్ల కాంబోలో మాత్రం సినిమా ఉండబోతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా చేయడం లేదు అంటే చెప్పేస్తాడు. ‘మళ్లీ మాట్లాడదాం’ అంటే ఖచ్చితంగా ఈ సినిమా సెట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అందుకే ఇలా మాట్లాడారు అని భావిస్తున్నారు.
ఇక సూర్యని స్టేజిపై రాజమౌళి చాలా హుందాగా పొగిడేశారు. 30 ఏళ్ల కుర్రాడిలా ఇంకా సూపర్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు అని, మల్టీ టాలెంటెడ్ అని, అలాంటి హీరోతో వర్క్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మిస్ చేసుకోనని అన్న విషయాన్ని బయట పెట్టారు.
సూర్యపై రాజమౌళి ప్రశంసలు:
ఇక సూర్య ‘కరుపు’, అదేవిధంగా ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్రాలలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే సూర్య కొత్త సినిమా ‘సీన్’ గురించి కూడా రాజమౌళి మాట్లాడారు. గతంలో ‘సింగం’ చిత్రంలో మాస్ పోలీస్ పాత్రలో అదరగొట్టిన సూర్య ఇప్పుడు ‘సీన్’ సినిమాలో మరి న్యూ ఏజ్ సూపర్ పోలీస్‌గా కనిపించబోతున్నారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.




