Monday, August 3, 2026
HomeLATESTLenin OTT: ఓటీటీలోకి అఖిల్ లెనిన్ మూవీ.. ఎప్పుడంటే?

Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ లెనిన్ మూవీ.. ఎప్పుడంటే?

Lenin OTT: మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేటును లాక్ చేసుకుంది.

on
- Advertisement -banner Ad

Lenin OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం లెనిన్. ఈ సినిమా అఖిల్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది. అంతేకాకుండా మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా నిలిచింది. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. జులై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అఖిల్ ఈ సినిమాలో ఊర మాస్ అవతారంలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

ఓటీటిలోకి రాబోతున్న అఖిల్ లెనిన్ మూవీ..

ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ , ఎమోషనల్ సీన్స్ , పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ కూడా థియేటర్లో అభిమానులతో ఈలలు వేయించేలా చేశాయి. అఖిల్ కెరియర్ లోని ఈ సినిమా బెస్ట్ గా నిలుస్తుందని అభిమానులు భావించారు. థియేటర్లలో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటిలోకి రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ జీ 5 దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన ద్వారా ప్రకటించింది.

- Advertisement -
Advertisement

ALSO READ: బ్రేకప్ పై మొదటిసారి స్పందించిన అనుపమ పరమేశ్వరన్!

డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆగస్టు 7వ తేదీ నుంచి లెనిన్(Lenin OTT) సినిమా తెలుగులో స్ట్రిమింగ్ కాబోతోంది. జి5 ట్విట్టర్ లో అయ్యగారు ఆగస్టు 7న వస్తున్నారు.. మీరు రెడీనా అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థియేటర్లలో కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసిన లెనిన్ సినిమా మరో ఓటీటిలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించి సంగీతం హైలెట్గా నిలిచింది. తమన్ అద్భుతంగా అందించారు.

- Advertisement -
Advertisement

ALSO READ: ఒక్కేఒక్క వీడియోతో స్టార్ హీరోయిన్స్ ని కూడా తొక్కిపడేసిన అల్లు శిరీష్ భార్య నయనిక..!

పబ్లిసిటీతోనే సినిమాపై అంచనాలు..

తెలుగు సినీ పరిశ్రమలో ఆగ్రనిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా పబ్లిసిటీ కోసం అటు అక్కినేని నాగార్జున, నిర్మాత నాగవంశీ కూడా పక్క పబ్లిసిటీతో బాగా ప్రమోషన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ తో పాటు అఖిల్ నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు. అలాగే విలన్ గా నటించిన ప్రమోద్ పంజు నటన కూడా హైలెట్గా నిలిచింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you