Anasuya:యాంకర్ గా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ స్టైలిష్ లుక్ తో అభిమానులను ఆకట్టుకునే ఆమె తాజాగా జిమ్లో చేసిన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో ఆమె ఎనర్జీ, డెడికేషన్ చూసిన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిట్నెస్ పై అవగాహన పెంచేలా ఆమె చెప్పిన మాట లు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మొదలుపడితే ఆపాలనిపించదు:
వీడియోలో అనసూయ(Anasuya) మాట్లాడుతూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం అంత ఈజీ కాదు. కానీ ఒకసారి ట్రై చేస్తే కచ్చితంగా కంటిన్యూ చేస్తారు. చాలామంది ఈరోజు వద్దు రేపటి నుంచి మొదలు పెడదామని వాయిదా వేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి అలవాటు చేసుకోండి ఇక ఆపమన్న ఆపరు. ప్రతిరోజు కనీసం ఒక గంట సమయం శరీర ఆరోగ్యానికి కేటాయించాలని.. అవకాశం ఉంటే గంటన్నర పాటు వ్యాయామం చేయడం మరింత ప్రయోజకరమని ఆమె సూచించింది.
also read:OTT:ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళ బ్లాక్‌బస్టర్.. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ ఇది..!
వివిధ వ్యాయామాలతో ఫిట్నెస్ పై ఫోకస్:
జీమ్ సూట్ లో కనిపించిన అనసూయ పలు రకాల వర్కౌట్స్ చేస్తూ అదరహో అనిపించింది. వెయిట్ ట్రైనింగ్, స్కిప్పింగ్, స్ట్రెంత్ ఎక్ససైజ్, లోయర్ బాడీ ఫిట్నెస్ కు సంబంధించిన వ్యాయామాలు ఆమె వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా పెల్విక్ ప్రాంతం, ఇన్నర్ థైస్ బలంగా ఉండేందుకు తాను చేసే ప్రత్యేక వ్యాయామాలను కూడా చూపించింది. శరీర సౌష్టవంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని ఆమె వివరించింది.
also read:Anupama:ప్రకృతిలో లీనమైపోయి పరవశించిపోతున్న అనుపమ!
నెటిజన్ల నుంచి ప్రశంసలు:
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. అనసూయ క్రమశిక్షణ ఫిట్నెస్ పై ఉన్న నిబద్ధతను పలువురు అభిమానులు అభినందిస్తున్నారు. కొందరు ఆమెను ఫిట్నెస్కు స్ఫూర్తిగా అభివర్ణిస్తుండగా మరి కొందరు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అనసూయ ఇచ్చిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ గా మారింది.అనసూయ సినిమాలలో కూడా అద్భుతంగా రానిస్తూ ఉండడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి మరి సినిమాల్లోనే నటిస్తోంది. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా పలు రకాల వాటి పైన స్పందిస్తూ ఉంటుంది అనసూయ.
https://www.instagram.com/reel/Da61UFjho7Y/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==




