Sukumar :టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాలలో రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ కాంబో కూడా ఒకటి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరక్కుతున్న RC 17 సినిమాపై జనాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టును ప్రకటించి చాలా కాలం గడిచిన ఇప్పటివరకు సినిమా కథ ఏంటి..? ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది..? ఇతర కీలక అంశాలపై చిత్ర బృందం ఎలాంటి స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజుకు మరింత పెరిగిపోతుంది.
సమాచారం గోప్యంగా ఉంచుతున్న మేకర్ :
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో షూటింగ్ ప్రారంభమైన తర్వాత క్యాస్టింగ్, లుక్స్, కథకు సంబంధించిన కొన్ని అంశాలు లేదా బ్యాక్ డ్రాప్ గురించి చిన్న చిన్న అప్డేట్లు ఏదో ఒక విధంగా బయటకు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అధికారికంగా విడుదలైన సమాచారం.. చాలా పరిమితంగానే ఉండడంతో సోషల్ మీడియాలో ఈ చిత్రంపై అనేక ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
also read:Anasuya:అనసూయ ఫిట్‌నెస్ మంత్రం.. జిమ్ వీడియోతో అభిమానులకు స్పెషల్ మెసేజ్!
సుకుమార్ స్టైల్ ఇదేనా :
దర్శకుడు సుకుమార్(Sukumar )గత చిత్రాలను పరిశీలిస్తే కథలోని ప్రధాన అంశాలను విడుదలకు ముందు వరకు రహస్యంగానే ఉంచడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో ఉత్కంఠను కొనసాగిస్తూ సినిమా విడుదల వరకు ఆసక్తిగా నిలబెట్టే విధానాన్ని ఆయన తరచూ అనుసరిస్తూ ఉంటారు అందుకే ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమా ప్రకటన దశ నుంచి చర్చనీయాంశంగా మారుతుంది.
also read:OTT:ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళ బ్లాక్‌బస్టర్.. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ ఇది..!
అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు:
ప్రస్తుతం RC 17 కధ ఏ నేపథ్యంలో సాగుతుంది..? రామ్ చరణ్(Ram Charan) పాత్ర ఎలా ఉండబోతుంది..? ఈసారి సుకుమార్ ఎలాంటి కాన్సెప్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు..? అనే ప్రశ్నను అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అయితే వీటిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. సినిమాపై పూర్తి వివరాలు వెల్లడించకపోవడం కూడా ప్రచార వ్యూహంలో భాగమేనని సినీ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. అధికారిక అప్డేట్లు లేకపోయినా ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక మేకర్స్ నుంచి వచ్చే తదుపరి ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




