OTT:మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న కంటెంట్ ఆధారిత సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ముఖ్యంగా థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కధాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇటీవల విడుదలైన అనేక మలయాళ సినిమాలు థియేటర్లలోనే కాకుండా ఓటీటీ (OTT)లోను భారీ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అలాంటి మరో చిత్రం “చిన్ని చిన్ని ఆసై” డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధమైంది.
స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారు:
ఈ ఏడాది మలయాళం లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న “చిన్న చిన్న ఆసై” చిత్రాన్ని ఈనెల 28వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ ప్రకటించారు. థియేటర్లలో మంచి స్పందన దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. మలయాళం తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రాబోతుంది. దీంతో దక్షిణాది ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమాను వీక్షించేందుకు అవకాశం పొందనన్నారు.
also read:Anupama:ప్రకృతిలో లీనమైపోయి పరవశించిపోతున్న అనుపమ!
బలమైన నటీనటులు భావోద్వేగ కథ:
ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ కుటుంబ బంధాలు జీవితంలోని చిన్న చిన్న కోరికల చుట్టూ కథను ఆసక్తికరంగా నడిపించారు. సినిమాలో ఇంద్రన్స్, మధు, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనుభవజ్ఞులైన నటీనటుల ప్రదర్శన సినిమాకు మరింత బలం చేకూర్చిందని ప్రేక్షకులుప్రశంసిస్తున్నారు.
also read:Ramayana :’రామాయణ’ ట్రైలర్ లీక్తో సోషల్ మీడియా బ్లాస్ట్.. జటాయువు సీన్ హైలైట్!
తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి:
ఇటీవల మలయాళ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. డబ్బింగ్ వర్షన్లు , సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండడంతో ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి కథలను ఆస్వాదిస్తున్నారు. అదే నేపథ్యంలో “చిన్న చిన్న ఆసై” కూడా ఓటీటీలో మంచి స్పందన అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగిన ఈ సినిమా భావోద్వేగా కథనంతో పాటు సహజమైన నటనను ఇష్టపడే వారికి మంచి వినోదాన్ని అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై 28 నుంచి జియో హాట్ స్టార్ లో ఈ చిత్రం వీక్షించవచ్చు.




