త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా సమంత హీరోయిన్గా వచ్చిన అ ఆ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.
మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సడన్గా ఇండస్ట్రీకి కొంత కాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ అవకాశాలు అందుకుంటూ స్టార్ సెలబ్రిటీగా పేరు దక్కించుకుంది.
ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. మరొకవైపు ధృవ్ విక్రమ్ తో లవ్లో పడడం ఆ తర్వాత బ్రేకప్ అంటూ పలు మార్లు వార్తల్లో నిలిచింది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా ఎరుపు రంగు చీర కట్టుకొని అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
దీనికి కాంబినేషన్లో రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన ఈమె.. విభిన్న రీతులలో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ అభిమానులను అలరిస్తోంది.