Wednesday, July 29, 2026
HomeLATESTRao Bahadur Movie:ఓటీటీలోకి సత్యదేవ్ రావుబహదూర్ మూవీ?

Rao Bahadur Movie:ఓటీటీలోకి సత్యదేవ్ రావుబహదూర్ మూవీ?

Rao Bahadur Movie: సత్యదేవ ప్రధాన పాత్రలో వచ్చిన రావు బహదూర్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది.

on
- Advertisement -banner Ad

Rao Bahadur Movie:టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ నటుడిగా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ ఇటీవల కాలంలో నటించిన చిత్రం రావు బహుదూర్. ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు . ఇందులో సత్యదేవ్ కి జోడీగా దీపా థామస్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ సంస్థ సమర్పణలో రావడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ చిత్రం సైకలాజికల్ డ్రామా చిత్రంగా జులై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా థియేటర్లో విడుదల అయింది. సినిమా ట్రైలర్, టీజర్ తో అంచనాలను పెంచేసిందో.. అంతే స్థాయిలో సినిమా విజయాన్ని అందుకుంది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రావు బహదూర్..

ముఖ్యంగా సినిమాలో సత్యదేవ్ నటన .. డైరెక్టర్ వెంకటేష్ మహా మేకింగ్ స్టైల్ , ఈ సినిమాలోని కథ కూడా కొత్తగా ఉండడంతో సినీ విమర్శకులతో పాటు సినీ సెలెబ్రెటీల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో రన్ టైం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్ సొంతం చేసుకుంది. జులై 31 నుంచి ఈ సినిమా ఓటీటి వేదికగా అందుబాటులోకి రాబోతోంది.

- Advertisement -
Advertisement

also read:SS Rajamouli :రాజమౌళి రెమ్యునరేషన్ సీక్రెట్ ఇదే..వారణాసికి కూడా సేమ్ ప్లాన్..!

నెల రోజుల్లోనే..

అయితే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం , తమిళ్ వంటి భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విభిన్నమైన కథను చూడటం మిస్ అయిన ప్రేక్షకులు సైతం ఇప్పుడు ఓటీటిలో రావుబహదూర్ (Rao Bahadur Movie) చూడడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో విడుదలై నెలరోజులు కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది.

- Advertisement -
Advertisement

also read:TV:హైదరాబాద్ అమ్మాయి నుంచి స్టార్ యాక్ట్రెస్‌గా.. వందన గొల్లు సక్సెస్ స్టోరీ ఇదే!

రావు బహదూర్ మూవీ స్టోరీ..

స్టోరీ విషయానికి వస్తే.. 1991 నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది.. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ (సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతారు. నాలుగు నెలలకు మించి బతకడని వైద్యులు రిపోర్ట్ చెప్పగా, కానీ ఏడాది దాటిపోయిన సరే రామప్ప అలాగే ఉంటాడు.. పైపెచ్చు రోజు తాగుతూ బతికేస్తూ ఉంటూ.. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అయితే ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప.. వీడు తనకు పుట్టలేదని రామప్ప అనుమాన పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని తన స్నేహితుడు డాక్టర్ ఆచారి (వికాస్ ముప్పల) కి చెబుతూ బుర్ర తినేస్తుంటారు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా కుసుమప్ప ఎందుకు మరణించారు? కథలో రామప్ప భార్య రేణుక సంగతి ఏంటి? అనేది మిగతా స్టోరీ

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you