Wednesday, July 22, 2026
HomeLATESTBalan the boy:థియేటర్లో దుమ్ము దులిపేస్తున్న మలయాళం మూవీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

Balan the boy:థియేటర్లో దుమ్ము దులిపేస్తున్న మలయాళం మూవీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

Balan the boy: ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బాలాన్ మూవీ త్వరలోనే ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది .

on
- Advertisement -banner Ad

Balan the boy:ప్రస్తుతం ఇప్పుడు ఏ భాషలో చూసినా ఎక్కువగా చిన్న సినిమాల హవానే కనిపిస్తోంది. అటు ఓటీటిలో కూడా పలు రకాల వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలు దుమ్మురేపుతున్నాయి. కంటెంట్ ను నమ్ముకున్న ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. అలా ఇటీవలే థియేటర్లలో విడుదలై ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. 8 రోజులలోనే కేవలం 24 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో నయా రికార్డ్ క్రియేట్ చేసింది చిన్న సినిమా. ఆ సినిమా ఏదో కాదు బాలాన్ : ది బాయ్.

థియేటర్లలో దూసుకుపోతున్న కొత్త మూవీ..

ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా మలయాళం లో పలు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ ఏడాది జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు మొదటి రోజు ఏకంగా రూ. 1.82 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది.

- Advertisement -
Advertisement

also read:Dilraju:ఆ సినిమాల విషయంలో తప్పు చేశా.. దిల్ రాజ్ కామెంట్స్ వైరల్!

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..

పైగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఓటీటి కోసం కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రముఖ డిజిటల్స్ ప్లాట్ ఫామ్ లలో ఒకటైన జీ 5 లో 40 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఓటీటి రిలీజ్ డేట్ ప్రకటించాలి.

- Advertisement -
Advertisement

also read:OTT:1978లో జరిగిన నిజమైన సంఘటనల కథ.. ఓటీటీను ఊపేస్తున్న వెబ్ సిరీస్..

బాలాన్ : ది బాయ్ స్టోరీ..

స్టోరీ విషయానికి వస్తే.. భర్తను కోల్పోయి కేసులో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన ఒక మహిళ(ఫర్జానా తింగల్తింగల్) తన కుమారుడు (ఆది శేషన్) చుట్టూ తిరుగుతుంది. జైలు నుంచి బయటికి వచ్చిన మహిళ.. పేర్లు మార్చకుంటూ, తన కొడుకుతో కలిసి పలుచోట్ల పని చేస్తుంది . ఎవరు అడిగినా కూడా తాను చెప్పినట్టుగానే చెప్పాలని తన కుమారుడికి ట్రైనింగ్ ఇస్తుంది. అలా తమ ఐడెంటిటీని మార్చుకుంటూ పలు చోట్ల తిరిగి చివరికి ఒక వృద్ధురాలి దగ్గర కేర్ గా చేరుతారు. అయితే ఆ కొద్ది రోజులకు ఆమె మరణిస్తుంది. ఈ విషయానికి లండన్ లో ఉన్న ఆమె కుమారుడికి చెప్పకుండా దాచిపెట్టి అదే ఇంట్లో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలా ఎంతో సవ్యంగా జరుగుతున్న సమయంలోనే ఆ మహిళ మరో హత్య చేస్తుంది. ఆ సమయంలోనే లండన్ లో ఉన్న వృద్ధురాలు కొడుకు కూడా ఇంటికి రావడం వారి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కుతుంది. తల్లి కోసం స్కూలు దగ్గర కొడుకు ఎదురు చూస్తుంటారు. అయితే బాలుడు తప్పిపోయాడనుకొని పోలీసులు అతడిని స్టేషన్ కి తీసుకువెళ్లగ.. అక్కడ తన తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగానే ఆ బాలుడు, తన అడ్రస్ ని పోలీసులకు చెప్పరు. ఆ తెలివితోనే స్టేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకుంటాడు. చివరికి ఆ బాలుడు ఎక్కడికి వెళ్తారు? తల్లిని కలుసుకుంటారా లేదా? చివరికి వినోద్ థామస్ ఎలా వచ్చారు ? అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you