Bethlehem Kudumba Unit:సినిమా అంటేనే ఒక మ్యాజిక్. ఒక సినిమా మనుషుల్ని మార్చగలదు. ఒక సినిమా మనుషులను చెడగొట్టగలదు. ఇది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక సినిమా ద్వారా సమాజంలో ఎన్నో విషయాలు అవగాహనలోకి వచ్చాయి. కొన్ని కొన్ని సినిమాల ద్వారా యువత భ్రష్టు పట్టిపోయే పరిస్థితులు కూడా వచ్చాయి. ఏదైనా సరే సినిమా చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆ సినిమాని ఎలా తీసుకున్నామన్నది టోటల్‌గా జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సినిమా :
కొన్ని కొన్ని సినిమాలు ఎన్ని చూసినా సరే, తనివి ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి లిస్టులోకి వచ్చేస్తుంది ఈ మలయాళం థ్రిల్లర్. ఈ మలయాళ చిత్రం పేరు ‘బెత్లెహెం ఫ్యామిలీ యూనిట్’(Bethlehem Kudumba Unit). ఈ సినిమా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసిస్తుంది.
రూ.23 కోట్ల బడ్జెట్.. భారీ వసూళ్లు :
కేవలం ఈ సినిమాకి మేకర్స్ ఖర్చు పెట్టింది రూ.23 కోట్లే. కానీ ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోతుంది. దాదాపు రూ.233 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇంకా వసూలు చేస్తుంది.
ఈ సినిమాలో నివిన్ పౌలీ, మమిత బైజు ఇద్దరు హీరో, హీరోయిన్లుగా కనిపించారు. మమిత బైజు ఎక్స్‌ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్‌రౌండ్‌గా ఎటువంటి ఎక్స్‌ప్రెషన్స్‌నైనా అవలీలగా పలికించేస్తుంది. ఈ సినిమాతో మమిత బైజు రేంజ్ వేరే లెవెల్‌కి వెళ్లిపోయిందని చెప్పడంలో సందేహమే లేదు.
also read:Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!?
తెలుగు, తమిళ్ వెర్షన్స్ కూడా విడుదల :
ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం చిత్రం ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్ వెర్షన్స్‌లో సెప్టెంబర్ 4న విడుదల అయింది. ఈ సినిమా రెండు వారాల తర్వాత కూడా అభిమానులను ఇంకా ఇంకా ఆకట్టుకుంటుంది.ఈ సినిమా రోజువారీ వసూళ్లు దాదాపు 44 శాతానికి పైగానే ఉన్నాయి. అంటే ఈ సినిమా అభిమానులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
also read:Kayadu Lohar:మహిళలంటే ఆట వస్తువులు కాదు.. ఫైర్ ఆయన కయాదులోహర్..!
ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? :
ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఓటీటీ తేదీని ఇంకా అనౌన్స్ చేయలేదు. సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఆడే సినిమాలు థియేటర్లలో వాటి ప్రదర్శన తగ్గే వరకు వేచి చూస్తూ ఉంటాయి. దాని కోసమే ఓటీటీ డేట్ ఆలస్యం అవుతుందని అంటున్నారు.
రూ.300 కోట్ల క్లబ్‌లోకి వెళ్తుందా? :
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ‘బెత్లెహెం ఫ్యామిలీ యూనిట్’ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఫ్యామిలీని బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈజీగా రూ.300 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




