Kayadu Lohar:ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో కథానాయికగా పేరు సంపాదించి ఇతర భాషలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్స్ జాబితాలలో కయాదు లోహరు కూడా ఒకరు. అస్సాంలో పుట్టి పూణేలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మోడలింగ్ ప్రపంచం నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కయాదులోహర్ మహిళలను అసభ్యకరంగా చూపించే ధోరణి పైన తాను వ్యతిరేకంగా ఉంటానంటూ తెలియజేస్తోంది. మరి వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
అలాంటి పాత్రలను సహించేదే లేదు..
సినిమాలలో స్త్రీలను ఒక అందమైన వస్తువులా కేవలం అలంకారప్రాయంగా మాత్రమే చూపిస్తున్నారు. ఆ విషయాన్ని తాను అంగీకరించినని.. ఒక సన్నివేశంలో బోల్డ్ సీన్ అనేది కేవలం కథకు ఎంత అవసరమో అనేది నాకు ముఖ్యము.. పాత్ర డిమాండ్ చేస్తే ఒక స్థాయి పరిమితుల వరకు లోబడి చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి అసభ్యతను జోడిస్తే మాత్రం అలాంటి చిత్రాల వైపు తాను కన్నెత్తి కూడా చూడనంటూ తెలిపింది కయాదు. అలాంటి సీన్స్ కేవలం సోషల్ మీడియాలో ట్రెండు అవ్వచ్చు కానీ ఒక నటిగా నా మనసుకి ఏ మాత్రం సంతృప్తినివ్వదని.. ఇలాంటి విషయాలలో తాను ఎప్పుడూ కూడా రాజీ పడలేదంటూ తెలిపింది కయాదులోహర్(Kayadu Lohar).
also read:Tollywood:టైటిల్‌తోనే సంచలనం.. భారతీయ సినిమాలో కొత్త రికార్డు సృష్టించిన సినిమా!
మోడల్ నుండి హీరోయిన్ గా..
టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలలో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటనపరంగా అడుగులు వేసి కన్నడ ఇండస్ట్రీలో మొగిల్ పేట్ చిత్రంతో తన కెరీయర్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత మరాఠీలో పలు భాషలలో నటించి తెలుగులో శ్రీ విష్ణు నటించిన అల్లూరి చిత్రం ద్వారా మరింత ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. విశ్వక్ సేన్ నటించిన ఫంకీ సినిమాతో తెలుగులో మరింత దగ్గర అయింది. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
also read:Tollywood: డిసెంబర్ సీజన్‌పై స్టార్ హీరోల ఫోకస్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనా?
కయాదు లోహర్ సినిమాలు..
అలాగే శింబు నటిస్తున్న చిత్రంలో, హీరో సూర్య నటిస్తున్న చిత్రంతో పాటుగా రజనీకాంత్ వంటి అగ్ర నటులతో కూడా నటించే అవకాశాలను సంపాదించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కయాదులోహర్.. సినిమాలలో మహిళలను చూపించే విధానం పైన స్పందించడంతో అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను మరింత ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను సంపాదించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.




