Taapsee Pannu:టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్గా పేరు సంపాదించిన సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఒకరు. నిరంతరం ఏదో ఒక విషయంలో ఈమె పేరు వైరల్ గా మారుతుంది. అయితే ఇప్పుడు తాజాగా భారతీయ సినిమాలలో మహిళలను వస్తువులుగా చూపించడం పైన తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కేవలం దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా ప్రేక్షకులు చూసే ధోరణి కూడా మారాలని పిలుపునిచ్చింది. రామ్ చరణ్ నటించిన పెద్ది, యశ్ నటించిన టాక్సిక్ వంటి చిత్రాల పైన ఈమె విమర్శలు చేసింది.
మహిళల వస్త్రధారణ పై సినిమాలలో చూపించే తీరు మారాలి..
తాజా ఇంటర్వ్యూలో తాప్సీ(Taapsee Pannu) మాట్లాడుతూ ప్రేక్షకులు కోరుకున్నది మేము ఇస్తున్నామనే వాదన సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తోంది. జనాలు ఏది కోరుకుంటే అది ఇవ్వకపోతే డబ్బులు ఎలా వస్తాయి అంటూ మేకర్స్ భావిస్తున్నారు. ఆ ఆలోచన విధానం పూర్తిగా మారాలి. కేవలం నటులు దర్శకులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేరు.. సోషల్ మీడియాలో ప్రేక్షకులు వ్యవహరించే తీరు కూడా ఈ సంస్కృతిని కొనసాగడానికి ముఖ్య కారణం అవుతుంది అంటూ తాప్సీ విమర్శించారు. సినిమాలలో కొన్ని సన్నివేశాలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ మరి కొంతమంది వాటిని ఫోటోలుగా తీసి జూమ్ చేసి చూడడం, వీడియోలు చిత్రీకరించడం, వైరల్ గా చేయడం వంటి పనులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది తాప్సి.
also read:Bethlehem Kudumba Unit:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమకథ..యూత్‌ను ఊపేస్తున్న సినిమా ఇదే..!
నటులను గెలిపించే బాధ్యత ప్రేక్షకులదే..
దీనివల్ల సోషల్ మీడియాలో అలాంటి కంటెంట్ కి ఇప్పుడు ఎక్కువగా ఆదరణ పెరుగుతోందని సంకేతాలు చెప్పకనే చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు ఇండియన్ సినిమా గురించి ఆలోచించాలి. ప్రపంచ స్థాయి చిత్రాలతో పోటీపడ్డాము. కానీ ఇప్పుడు మళ్లీ సినీ పరిశ్రమ వెనకడుగు వేస్తోందనే అభిప్రాయం కనిపిస్తోందని తెలిపింది. ఈ విషయాలపైన చిత్ర నిర్మాతలు కూడా చివరికి ప్రేక్షకుల పైనే నెట్టేస్తున్నారు. ఆ సమయంలో నటుల దగ్గర చెప్పడానికి ఎలాంటి సమాధానం కూడా లేదని తాప్సి తెలిపారు. ఈ పోరాటంలో నటులు మాత్రమే ఒంటరివారవుతున్నారని ప్రేక్షకులే సహాయం చేసి ఈ యుద్ధంలో తమను గెలిపించాలంటూ తెలిపింది.
also read:Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!?
టాక్సిక్, పెద్ది మూవీలపై తాప్సీ ఫైర్..
ఇటీవలే రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర పైన చాలానే విమర్శలు వినిపించాయి.. అలాగే యశ్ నటించిన టాక్సిక్ చిత్రంలో మహిళలు చిత్రీకరణ పైన సామాజిక మాధ్యమాలలో చాలా ట్రోల్స్ , చర్చలు కూడా జరుగుతున్న సమయంలో తాప్సి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారుతున్నాయి. పెద్ది చిత్రంలోని జాన్వీ కపూర్ సీన్స్ పైన విమర్శలు రావడంతో అందులోని కొన్ని సన్నివేశాలను తొలగించి మరి బుచ్చిబాబు క్షమాపణలు కూడా తెలియజేశారు. మరి ఇకమీదటైనా హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ గానే కాకుండా సినిమాలలో తమ పాత్రలకు కూడా గుర్తింపు ఉండేలా చూడాలని చాలామంది సెలబ్రిటీలు తమ అభిప్రాయంగా చెబుతున్నారు.




