Sunday, September 6, 2026
HomeLATESTMokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!?

Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!?

Mokshagna:నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Mokshagna:నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే తనదైన స్టైల్‌లో ఇండస్ట్రీలో ఒక క్రేజీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. నందమూరి బాలయ్య కుమారుడిగా మోక్షజ్ఞ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయనకు సంబంధించిన సినిమా అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా..? అని దాదాపు గత నాలుగేళ్లుగా కోట్లాది మంది ఫ్యాన్స్ వేచి చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిగో అప్‌డేట్.. అదిగో అప్‌డేట్ అంటూ ఊరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ రాలేదు.

పుట్టినరోజునైనా అనౌన్స్‌మెంట్ వస్తుందని ఆశలు :

నేడు నందమూరి మోక్షజ్ఞ(Mokshagna) పుట్టినరోజు. ఈ రోజు ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ ఆయన సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇస్తుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటి అనౌన్స్‌మెంట్ ఏదీ రాలేదు. ఇకపై వస్తుందన్న ఆలోచనలో కూడా జనాలు మానుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Kayadu Lohar:మహిళలంటే ఆట వస్తువులు కాదు.. ఫైర్ ఆయన కయాదులోహర్..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్ :

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక క్రేజీ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ దసరాకు స్టార్ట్ కాబోతుందట. బాలయ్యకు చిన్న గాయం కారణంగా ఇవాళ స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. దసరా సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నారట. ఆరోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందట.

- Advertisement -
Advertisement

also read:Tollywood:టైటిల్‌తోనే సంచలనం.. భారతీయ సినిమాలో కొత్త రికార్డు సృష్టించిన సినిమా!

వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా? :

అంతేకాదు, ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంతేనా.. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ, క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందట. అంతేకాదు, 15 నిమిషాల క్యారెక్టర్ కోసం ఏకంగా నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతుంది.

- Advertisement -
Advertisement

బాలయ్య కోసం 15 నిమిషాల స్పెషల్ క్యారెక్టర్? :

ఈ 15 నిమిషాల క్యారెక్టర్ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని షేక్ చేసే విధంగా డైరెక్టర్ వశిష్ట కథను రాసుకున్నారట. తండ్రితో మొదటి సినిమాతోనే స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం దక్కడం అంటే వెరీ వెరీ లక్కీ అనే చెప్పాలి. అలాంటి రికార్డ్‌ను నందమూరి మోక్షజ్ఞ ముందుగానే అందిస్తున్నాడు.

మోక్షజ్ఞ, బాలయ్య, శ్రీలీల కాంబినేషన్‌పై భారీ అంచనాలు :

ఇక హీరోయిన్ శ్రీలీలకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదో అందరికీ తెలిసిందే. ఒకపక్క శ్రీలీల, మరోపక్క బాలయ్య.. ఈ ముగ్గురినీ మిక్స్ చేస్తే కచ్చితంగా బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే.. నో డౌట్ అని అభిమానులు భావిస్తున్నారు. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ హిట్ సంపాదించేసుకుంటాడు మోక్షజ్ఞ అంటూ అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. చూడాలి మరి.. దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్‌ను రివీల్ చేస్తారో లేదో. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you