Wednesday, November 4, 2026
HomeLATESTBigg Boss 10:ఈ వారం నామినేషన్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎంత మందో తెలుసా..?

Bigg Boss 10:ఈ వారం నామినేషన్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎంత మందో తెలుసా..?

Bigg Boss 10: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 10 లో 9వ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ జాబితా వైరల్ గా మారింది..

on
- Advertisement -banner Ad

Bigg Boss 10:తెలుగు బిగ్ బాస్ 10వ సీజన్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా, హోరాహోరీగా కొనసాగుతోంది. ప్రస్తుతం 58 వ రోజు కొనసాగుతోంది. గత 2 వారాలలో బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఊహించిన విధంగా కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంపై ఆడియన్స్ కి ఊహించని షాక్ అయితే తగిలింది. డబుల్ ఎలిమినేషన్ కారణంగా గత రెండు వారాలలో మొత్తం మీద నలుగురు కంటెస్టెంట్స్ సైతం బయటికి వెళ్లిపోయారు. దీంతో 9వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం పైన ఆడియన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ 10లో నామినేషన్ లిస్ట్..

వీటికి తోడు ఇప్పుడు రోహిత్ బయటికి వెళ్లిపోవడం, హౌస్ లో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ మధ్య పోటీ ఏర్పడడం, ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా మరింత ఉత్కంఠగా మారింది. హౌస్ లో పాత పగలు , కొత్త కోపాలు అన్నీ కూడా నామినేషన్ రూపంలో కనిపిస్తున్నా.. చివరికి ఈవారం ఎలిమినేషన్ కి సంబంధించి 10మంది కంటెస్టెన్స్ సైతం నామినేషన్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ వేటలో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ కూడా ఈ నామినేషన్ లిస్టులో ఉండడం మరింత ఆసక్తిని పెంచేస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Renu Desai:పవన్ కోసం రేణు దేశాయ్.. షారుఖ్ కోసం కరణ్.. అప్పట్లో ఏం జరిగిందంటే?

ఈ వారం నామినేషన్ లో ఉన్నది ఎవరంటే?

ముఖ్యంగా వర్షిని, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశి, నీతు మాస్టర్, నరేష్, దెబ్జని, శివ, సుధీర్, రాంప్రసాద్ ఈ వారం నామినేషన్ లిస్టులో ఉన్నారు. వీరికి సంబంధించి ఆన్లైన్ ఓటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఓటింగ్ విషయానికి వస్తే ముకేశ్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత టెంపర్ వంశీ, దెబ్జని , సుధీర్, శివ కుమార్, అమన్ , రాంప్రసాద్, నరేష్, వర్షిని, నీతూ మాస్టర్ అన్నారు. ప్రస్తుతం నామినేషన్ లో ఉన్న ఈ పదిమందిలో యాంకర్ వర్షిని డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికి ఎన్నోసార్లు ఈమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నప్పటికీ కచ్చితంగా ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లడం ఖాయం అనే విధంగా టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Jabardasth Rohini:కమిట్‌మెంట్ అడిగిన నిర్మాత మేనేజర్.. రోహిణి సంచలన వ్యాఖ్యలు!

రోహిత్ రీఎంట్రీ ఇస్తారా?

వాస్తవానికి గత వారమే వర్షిని ఎలిమినేట్ కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల యాంకర్ ఝాన్సీ బలైపోయింది. ఇక నామినేషన్ల ప్రక్రియలో కూడా తమ సొంత స్నేహితులని నామినేట్ చేయడం, తిరిగి వాళ్లతోనే మూవ్ అవడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఈసారి మాత్రం వర్షినికి ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకొనే అవకాశాలు లేవంటూ బిగ్ బాస్(Bigg Boss 10) విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి. అంతేకాకుండా రోహిత్ మళ్లీ ఈసారి హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you