Jayam Ravi:”జయం రవి”.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ హీరో పేరు ఎలా ట్రెండ్ అయిందో అందరికీ బాగా తెలిసిందే. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్‌గా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న జయం రవి అలియాస్ రవి మోహన్, ఈ మధ్యకాలంలో విడాకుల విషయం కారణంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన జయం రవి(Jayam Ravi), అనూహ్యంగా విడాకుల వార్తతో వైరల్ కావడం జనాలకు బాగా ఇబ్బంది కలిగించింది.
జయం రవికి అభిమానుల మద్దతు :
చాలామంది జయం రవి తప్పు లేదని, ఆయన భార్య, ఆమె తల్లిదే తప్పు అయి ఉంటుందని, భార్య జయం రవిని బాగా టార్చర్ పెట్టినట్లు ఉందని, అందుకే ఆయన ఈ బాధలు తట్టుకోలేక విడాకులు కోరినట్లు ఉందని జయం రవికి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఆర్తి, ఆమె తల్లి.. జయం రవి గురించి ఇన్ని విషయాలు చెప్పినా జనాలు నమ్మలేదు. జయం రవి చాలా మంచి వ్యక్తి అని, ఆయన చాలా నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి అని సోషల్ మీడియా వేదికగా జయం రవికి మద్దతుగా నిలిచారు.
also read:Madhuri Rathod:మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. లెటర్ వైరల్..!
ఇప్పుడు జయం రవిపై విమర్శలు :
సీన్ కట్ చేస్తే.. అప్పుడు ఏ జనాలైతే ఆయనకు మద్దతుగా నిలిచారో, ఇప్పుడు అదే జనాలు ఆయనను తప్పుపడుతున్నారు. దానికి కారణం ఒక వీడియో. జయం రవి సింగర్ కెనీషాతో డేటింగ్‌లో ఉన్నాడు అన్న విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దానికి తగ్గట్టే వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జయం రవి, కెనీషా సిగరెట్ వీడియో వైరల్ :
అయితే ఇప్పుడు ఏకంగా ఒక వీడియో బయటకు వచ్చింది. జయం రవి, సింగర్ కెనీషా పక్కపక్కనే కూర్చుని సిగరెట్ తాగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హీట్ చేస్తుంది. జయం రవి సిగరెట్ తాగి అది కెనీషాకు ఇస్తాడు. కెనీషా కూడా సిగరెట్ తాగి మళ్లీ జయం రవికి ఇస్తుంది. ఏదో గ్రూప్ మీటింగ్‌లో డిస్కషన్ చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హీట్ పెంచేస్తుంది.
జయం రవి ఫ్యాన్స్ ఘాటు రియాక్షన్ :
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జయం రవిపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. “నిన్ను ఇంత నమ్మాం. ఇలా మోసం చేస్తావని అనుకోలేదు. తప్పు నీదే. నీ భార్య నిన్ను వదిలించుకుని మంచి పని చేయాలనుకుంది” అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం జయం రవికి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. “ఒక వ్యక్తి సిగరెట్ తాగినంత మాత్రాన అది తప్పుగా అనుకోకూడదు. అక్కడ జరిగింది ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న వీడియో:
ఇప్పుడు సోషల్ మీడియాలో జయం రవి, ఆయన ప్రేయసి సింగర్ కెనీషా సిగరెట్ తాగుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో బాగా హీట్ పెంచేస్తూ ట్రెండ్ అవుతుంది. దీనిపై వీళ్లు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
I stood up for Jayam Ravi when the divorce news broke because I genuinely believed his side. But seeing videos of him is a reality check. Disappointed to see how things are turning out definitely lost respect for him.
Day by day Ravi 🤒 pic.twitter.com/cjwTaoL9x4
— Sundar Vijay (@ItsSundarVJ) September 6, 2026




