Ameesha Patel:హార్దిక్ పాండ్యా పేరు వినగానే క్రికెటర్‌గానే గుర్తొస్తుంది. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఒక పాన్ ఇండియా హీరోకు మించిన స్థాయిలోనే ఉంటుంది. హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌గా క్రికెట్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటారు. అదే విధంగా ట్రోలింగ్‌కు కూడా గురవుతూ ఉంటారు.
అమీషా పటేల్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్ రూమర్స్ :
రీసెంట్గా ఆయన విషయంలో సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయ్యారు. కొంతమంది ఆయనను మెచ్చుకుంటే, మరికొంతమంది తిట్టుకున్నారు. బాలీవుడ్ నటి అమీషా పటేల్(Ameesha Patel)తో హార్దిక్‌కు సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో పలు రకాల రూమర్లు బాగా వైరల్ అయ్యాయి. ఇవి చాలా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ గాసిప్‌పై అమీషా పటేల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరికీ నోరుమూయించేలా చేసింది.
ఒకే వేదికపై అమీషా, హార్దిక్ :
ఇటీవల ఓ స్టార్ హోటల్లో జరిగిన విందులో అమీషా పటేల్ కనిపించింది. ఒక్కరే కనిపించలేదు. అమీషా పటేల్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా కనిపించారు. ఈ సందర్భంగా అమీషా తన స్నేహితులకు హార్దిక్‌ను పరిచయం చేస్తూ, అతని భుజంపై కూడా చేయి వేసిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయింది. ఎలా అంటే.. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారేమో అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
also read:OTT Releases: సెప్టెంబర్ రెండో వారం అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు!
అమీషా పటేల్ ఘాటు కౌంటర్ :
అంతేనా.. ఓ నెటిజన్ ఇదే వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, హార్దిక్, అమీషా గురించి వస్తున్న రూమర్ నిజమే అంటూ బాగా హీట్ పెంచుతూ కామెంట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ అనుమానం వ్యక్తం అయింది. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీళ్లిద్దరి గురించి రకరకాల వార్తలు, పుకార్లు షికార్లు చేశాయి.
దీంతో సదరు నెటిజన్ పోస్టుకు అమీషా పటేల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. హార్దిక్ భుజంపై చేయి ఎందుకు వేశాను అంటే ప్రేమకు గుర్తుగా. అంతే.. ఎంతవరకు అది సమాజం యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు. ఈ విధంగా రూమర్స్ క్రియేట్ చేయడం తప్పు. ఒక మహిళ తన ఫ్రెండ్‌పై చేయి వేయకూడదా? అలా చేయి వేస్తే డేటింగ్ అయినట్లా? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
also read:TV:టీవీ ప్రేక్షకులకు పండగే.. ఈరోజు ఏ ఛానల్లో ఏ సినిమా చూడొచ్చంటే?
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు :
దీంతో హార్దిక్, అమీషా పటేల్ మధ్య ఏదో నడుస్తుంది అన్న పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఒక అమ్మాయి, అబ్బాయి క్లోజ్‌గా ఉంటే, భుజంపై చేయి వేసుకుంటే అది డేటింగ్ అనుకోవడం తప్పు అంటూ జనాలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. ఇది మారుతున్న కలియుగం. ఈ యుగంలో ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. మనపై నిందలు పడే విధంగా ఎటువంటి ప్రవర్తన చేయకూడదు అంటూ అమీషాకు కౌంటర్ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు అమీషా పటేల్, అదేవిధంగా హార్దిక్ పాండ్యా పేరు మారుమోగుతోంది.




