Monday, September 7, 2026
HomeLATESTMS Raju:హీరోయిన్ తో గొడవపై ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్..!

MS Raju:హీరోయిన్ తో గొడవపై ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్..!

MS Raju: ప్రముఖ డైరెక్టర్ నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎమ్మెస్ రాజు స్టార్ హీరోయిన్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

MS Raju:తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఎమ్మెస్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో చిత్రాలను తన సినిమా బ్యానర్ నుంచి తెరకెక్కించి స్టార్ హీరోలతో మంచి విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా మహేష్ ఒక్కడు, ప్రభాస్ వర్షం వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు ఎమ్మెస్ రాజు. ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఇలా పలు విషయాలను తెలిపారు.

తన వ్యక్తిత్వం పై కామెంట్ చేసిన ఎమ్మెస్ రాజు..

తాను ఇండస్ట్రీలో ఏ నటుడికి లేదా డైరెక్టర్ కి కూడా చెడు చేయలేదని, తన వల్లే అందరికీ మంచి జరిగిందంటూ తెలిపారు ఎమ్మెస్ రాజు. పరిశ్రమలో తన పట్ల కొంత మంది కృతజ్ఞతగా లేరనే వాదనను ఆయన ఖండించడం జరిగింది. తనను ఎవరూ కూడా ఇప్పటివరకు ఏమీ అనలేదని , తన పైన ఎవరు చెడుగా మాట్లాడలేదని, స్టార్ హీరోలను డేట్స్ అడగడానికి తన దగ్గర మంచి కథ , డైరెక్టర్, పెట్టుబడి ఉండాలని .. ప్రస్తుతానికి తాను ఉన్న పరిస్థితులలో ఆ స్థాయికి రాలేదని తెలిపారు. కానీ మంచి కాన్సెప్ట్ దొరికితే తాను చిన్న సినిమాలని చేయాలనే ఆలోచనతోనే ఉన్నానని వెల్లడించారు . చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించేలా ప్రస్తుతం ఉన్నాయని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Taapsee Pannu:పెద్ది, టాక్సిక్ సినిమాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..!

స్టార్ హీరోయిన్ తో గొడవలపై క్లారిటీ..

అలాగే ఒక స్టార్ హీరోయిన్ తో ఎమ్మెస్ రాజుకు(MS Raju) జరిగిన గొడవ వల్ల ఆ విషయం పెద్ద సంచలనంగా మారిందని తెలిపారు.. నేరుగా ఆ హీరోయిన్ పేరు చెప్పకపోయినా తన ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలిగినప్పుడు తాను రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. దీనివల్ల ఒక పెద్ద సినిమాను మధ్యలో కూడా ఆపేశానని , తన నిబంధనలు షరతులు ఎవరు అంగీకరించకపోయినా.. సినిమాను వదిలేస్తానని.. ఇది అహంకారం కాదు వ్యక్తిత్వం అంటూ ఎమ్మెస్ రాజు తెలిపారు. అలాగే తాను అనుకున్నట్లుగా జరగని మరో సినిమాను అసలు ప్రారంభించలేదని, ఆ తర్వాతే అదే చిత్రాన్ని వేరే సినిమాగా తీయడం వల్ల అది ప్లాప్ అయ్యిందని కూడా తెలిపారు. కానీ ఆ హీరోయిన్ ఎవరనే విషయం చెప్పలేదు. ఈ విషయంపై పలువురు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Bethlehem Kudumba Unit:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమకథ..యూత్‌ను ఊపేస్తున్న సినిమా ఇదే..!

తాను మంచి కోరుకునే వ్యక్తిని..

ఇండస్ట్రీలో తాను కుంగిపోయినప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. తన తోటి నిర్మాతలు , మిత్రులు కూడా మళ్లీ పైకి రావాలని కోరుకున్నారని తెలిపారు. తాను ఎప్పుడూ కూడా అందరికీ మంచి చేశానని, ఎవరైనా కష్టాలలో ఉంటే వారికి అండగా ఉంటానని , ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే తాను ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు. కొన్ని విషయాలు అనవసరంగా వివాదం చేయడం సరికాదు అని, తాను అందరిని ఒకే లాగా చూస్తాను అంటూ తెలిపారు ఎమ్మెస్ రాజు. ఇటీవల అగద సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమ్మెస్ రాజు మంచి విజయాన్ని అందుకున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you