Saturday, September 5, 2026
HomeLATESTTV:ఈ శుక్రవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

TV:ఈ శుక్రవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

TV:ఈ శుక్రవారం టీవీ ప్రేక్షకులకు అదిరిపోయే సినిమాల సందడి ఉండనుంది. తెలుగు, ఇతర భాషల చిత్రాలతో పలు ఛానళ్లు వినోదాన్ని అందించనున్నాయి.

on
- Advertisement -banner Ad

TV:బుల్లితెరపై వినోదానికి ఎప్పుడూ కొరత ఉండదు. ముఖ్యంగా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ప్రతి రోజూ వివిధ ఛానళ్లలో ఎన్నో చిత్రాలు అందుబాటులో ఉంటాయి. ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో సినిమాలు చూసేందుకు ఇష్టపడే వారి కోసం శుక్రవారం కూడా పలు ఛానళ్లు ఆసక్తికరమైన చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. ఏ ఛానెల్‌లో(TV) ఏ సినిమా, ఏ సమయంలో వస్తుందో తెలుసుకుందాం.

డీడీ యాదగిరి, ఈటీవీ ఛానళ్లు:

డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు “ది డెస్పరెట్ అవర్” తెలుగు డబ్బింగ్ చిత్రం, మధ్యాహ్నం 2 గంటలకు “శ్రీకృష్ణ విజయం” ప్రసారం కానున్నాయి. ఈటీవీ ప్లస్‌లో రాత్రి 9.30 గంటలకు “పెళ్లి పీటలు” ప్రసారం కానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 10.30 గంటలకు “శ్రీకృష్ణార్జున విజయం” రానుంది.

- Advertisement -
Advertisement

ఈటీవీ లైఫ్‌లో సాయంత్రం 3 గంటలకు “శ్రీకృష్ణావతారం” ప్రసారం కానుంది.

ఈటీవీ సినిమా:

ఈటీవీ సినిమాలో ఉదయం 10 గంటలకు “శ్రీకృష్ణావతారం”, మధ్యాహ్నం 1 గంటకు “యశోద కృష్ణ”, సాయంత్రం 4 గంటలకు “యమలీల”, రాత్రి 10 గంటలకు “శ్రీకృష్ణార్జున విజయం” ప్రసారం కానున్నాయి. ఉదయం 7 గంటలకు “బాల భారతం”, అర్ధరాత్రి 1 గంటకు అదే చిత్రాన్ని మరోసారి ప్రసారం చేయనున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Allari Naresh:”రంభ ఊర్వశి మేనక” మూవీ రివ్యూ: అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్..కామెడీతో చంపేశాడు..!

జెమినీ ఛానళ్లలో:

జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “సిరివెన్నెల”, సాయంత్రం 4.30 గంటలకు “కుటుంబ గౌరవం” రానున్నాయి. జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు “దానవీర శూరకర్ణ”, మధ్యాహ్నం 3 గంటలకు “కార్తికేయ” ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

జెమినీ మూవీస్‌లో తెల్లవారుజామున 1.30 గంటలకు “అప్పుడప్పుడు”, 4.30 గంటలకు “కలవరమాయే మదిలో”, ఉదయం 7 గంటలకు “కన్నయ్య కిట్టయ్య”, 10 గంటలకు “మహాచండి”, మధ్యాహ్నం 1 గంటకు “దొంగోడు”, సాయంత్రం 4 గంటలకు “శ్రీరస్తు శుభమస్తు”, రాత్రి 7 గంటలకు “సెవెన్త్ సెన్స్”, 10 గంటలకు “గమ్యం” ప్రసారం కానున్నాయి.

ALSO READ:Shalini Pandey: బాత్రూం ఫోటోలతో హీట్ పుట్టించిన అర్జున్ రెడ్డి బ్యూటీ!

జీ తెలుగు, జీ సినిమాలు:

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు “కల్కి”, సాయంత్రం 5 గంటలకు “డీమాంటే కాలనీ” ప్రసారం కానున్నాయి. జీ సినిమాల్లో తెల్లవారుజామున 3 గంటలకు “రంగ్ దే”, ఉదయం 7 గంటలకు “దువ్వాడ జగన్నాథం”, 9 గంటలకు “శతమానం భవతి”, మధ్యాహ్నం 12 గంటలకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, 3 గంటలకు “ఓదెల 2”, సాయంత్రం 6 గంటలకు “హే బల్‌వంత్”, రాత్రి 9 గంటలకు “కిష్కిందపురి” రానున్నాయి.

స్టార్ మా ఛానళ్లలో:

స్టార్ మాలో తెల్లవారుజామున 1.30 గంటలకు “డిటెక్టివ్”, ఉదయం 4 గంటలకు “మన్యంపులి”, 9 గంటలకు “సర్ మేడమ్”, రాత్రి 11 గంటలకు అదే “సర్ మేడమ్” చిత్రాన్ని ప్రసారం చేయనున్నారు.

స్టార్ మా మూవీస్‌లో ఉదయం 3 గంటలకు “హనుమంతు”, 7 గంటలకు “నవ మన్మథుడు”, 9 గంటలకు “భలే భలే మగాడివోయ్”, మధ్యాహ్నం 12 గంటలకు “చంద్రముఖి”, 3 గంటలకు “జులాయి”, సాయంత్రం 6 గంటలకు “మిరాయ్”, రాత్రి 9.30 గంటలకు “ది ఘోస్ట్” ప్రసారం కానున్నాయి.

స్టార్ మా గోల్డ్‌లో శుక్రవారం ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు “దేవరకొండ వీరయ్య”, ఉదయం 5 గంటలకు “చిలిపి జమీందార్” టెలికాస్ట్ అవుతాయి. 8 గంటలకు “నేనేరా ఆది”, 11 గంటలకు “పక్కా కమర్షియల్” ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు “యువరాజు”, సాయంత్రం 5 గంటలకు “పడి పడి లేచే మనసు” ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక రాత్రి 8 గంటలకు “పుష్పక విమానం” ప్రసారం కాగా, 11 గంటలకు మరోసారి “నేనేరా ఆది” టెలికాస్ట్ కానుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you