Duniya Vijay:ఒక కన్నడ నటుడు, డైరెక్టర్, నిర్మాతగా పేరు సంపాదించిన దునియా విజయ్ వైవాహిక జీవితానికి తాజాగా తెరపడింది ఆయన మొదటి భార్య నాగరత్నతో విడాకులు మంజూరు చేస్తూ.. తాజాగా కర్ణాటక హైకోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దాంపత్యానికి.. కోర్టు గురువారం రోజున ముగింపు ఇచ్చింది. విడాకులతో పాటుగా నాగరత్నకు ఏకంగా రెండు కోట్ల రూపాయల భరణం చెల్లించాలంటూ దునియా విజయ్ కి ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఈ మొత్తాన్ని రెండు నెలల లోపు చెల్లించాలంటూ గడువు కూడా ఇచ్చింది. గడువు లోపు భరణం చెల్లించకపోతే ప్రతిఏట ఆరు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అందుకే రెండు కోట్ల భరణం..
దునియా విజయ్ (Duniya Vijay)మొదటి భార్య నాగరత్న ప్రస్తుత పరిస్థితులు, దంపతులకు ఉన్న ముగ్గురు పిల్లల భవిష్యత్తు అలాగే సినీ పరిశ్రమలో దునియా విజయ్ ఆర్థికంగా ఉన్న పరిస్థితులను పరిగణంలోకి తీసుకొని రెండు కోట్ల రూపాయల భరణాన్ని కోర్టు నిర్ణయించింది. గతంలో దునియా విజయ్ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. అయితే భార్య పైన ఆయన కొన్ని ఆరోపణలు పేర్కొన నేపథ్యంలో వాటిని న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో దునియా విజయ్ వేసిన విడాకుల పిటిషన్ ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది.
ALSO READ:TV:ఈ శుక్రవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!
ఇద్దరి మధ్య విభేదాలకు కారణం..
అనంతరం విజయ్ నాగరత్నాల మధ్య వైవాహిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, తిరిగి తన భార్యతో కలిసి జీవించేందుకు హీరో విజయ్ కూడా సముఖంగా లేరని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కేసును విచారించిన కోర్టు తాజాగా వీరికి విడాకులు మంజూరు చేసింది. నాగరత్న తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేదంటూ దునియా విజయ్ గతంలో తన పిటీషన్ లో ఆరోపణలు చేశారు. ఈ అంశం పైన విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేయగా .. తెరపైన మంచి నడవడిక, విలువలను ప్రదర్శించే ప్రజా ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాలలో వాటిని పాటించాలంటూ సూచన ఇచ్చింది.
ALSO READ:Allari Naresh:”రంభ ఊర్వశి మేనక” మూవీ రివ్యూ: అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్..కామెడీతో చంపేశాడు..!
కీర్తి పట్టాడీతో పెళ్లి..
అనంతరం ఈ తీర్పు ఇరుపక్షాలను సవాల్ చేసేందుకు ధర్మాసనానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. దునియా విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టేశారు. 2007లో విడుదలైన దునియా అనే కన్నడ చిత్రం ద్వారా హీరోగా పేరు సంపాదించిన దునియా విజయ్ ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా కూడా పేరు సంపాదించారు. దునియా విజయ్ కీర్తి పట్టాడి అనే మోడల్ వివాహం చేసుకున్నట్లుగా 2016లో వికీపీడియాలో కనిపిస్తోంది. ప్రస్తుతం దునియా విజయ్ కి సంబంధించిన ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమలో మరింత వైరల్ గా మారింది.




