Wednesday, July 22, 2026
HomeMOVIE NEWSMaa Inti Bangaram: 'మా ఇంటి బంగారం' డిలీటెడ్ సీన్స్ వచ్చేశాయి.. థియేటర్‌లో ఉంటే ఇంకో...

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ డిలీటెడ్ సీన్స్ వచ్చేశాయి.. థియేటర్‌లో ఉంటే ఇంకో లెవల్ అయ్యేది..!

Maa Inti Bangaram:హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన "మా ఇంటి బంగారం" డిలీటెడ్ సీన్స్ విడుదలయ్యాయి. ఇవి థియేటర్ వెర్షన్‌లో ఉంటే కామెడీ, వినోదం మరో స్థాయికి చేరేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

on
- Advertisement -banner Ad

Maa Inti Bangaram :“మా ఇంటి బంగారం”.. హీరోయిన్ సమంత (Samantha)ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా. రీసెంట్ గానే ఈ సినిమా విడుదలై సెన్సేషనల్ రికార్డ్స్ నమోదు చేసింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేశారు. సమంత ఈజ్ బ్యాక్ అనేలా ఆమె పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

మా ఇంటి బంగారం నుండి డిలీటెడ్ సీన్స్ వైరల్..

ఈ సినిమా ఏకంగా ఓవర్సీస్లో 1.9 డాలర్లు క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డ్ నమోదు చేసింది. అంతేకాదు 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రెడీగా ఉంది. ఇలాంటి సందర్భంలో చిత్ర బృందం సినిమాకి సంబంధించిన డిలీటెడ్ సీన్స్ ను రిలీజ్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో “మా ఇంటి బంగారం” డిలిటెడ్ సీన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత అభిమానుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని, థియేటర్లలో చోటు దక్కని కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పుడు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఈ డిలిటెడ్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -
Advertisement

also read:Raksha Gowda:బుల్లితెర క్రష్ రక్షా గౌడ లైఫ్ జర్నీ: ఎవ్వరికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!

ఇవి ఉండుంటే సినిమా మరో లెవెల్..

సినిమా ఎడిటింగ్ సమయంలో నిడివి కారణంగా కొన్ని భావోద్వేగభరితమైన, కథను మరింత బలపరిచే సన్నివేశాలను తొలగించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పుడు విడుదలైన ఈ డిలిటెడ్ సీన్స్‌లో ప్రధాన పాత్రల మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధం, కుటుంబ బంధాలను మరింత హృద్యంగా చూపించే సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని పాత్రల ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను ఈ సన్నివేశాలు మరింత స్పష్టంగా చూపిస్తున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Rao Bahadur:‘రావు బహదూర్’ మూవీ రివ్యూ: ట్విస్టులతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్..సత్యదేవ్ కి ఆస్కార్ పక్కా?

ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్న డిలీటెడ్ సీన్స్..

డిలిటెడ్ సీన్స్ విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో మంచి వ్యూస్‌ను నమోదు చేశాయి. అభిమానులు ఈ సన్నివేశాలను ప్రశంసిస్తూ, “ఇవి సినిమాలో ఉంటే కథ మరింత ఎమోషనల్‌గా అనిపించేది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఎడిటింగ్‌లో తొలగించినప్పటికీ ఇప్పుడు వాటిని విడుదల చేయడం మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Advertisement

మొత్తానికి, ‘మా ఇంటి బంగారం’ డిలిటెడ్ సీన్స్ విడుదలతో మరోసారి సోషల్ మీడియాలో సమంత పేరు బాగా ట్రెండ్ అవుతుంది. ఆ డిలిటెడ్ సీన్స్ చూసి జనాలు బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం ..ఆ డిలిటెడ్ సీన్స్ పై మీరు ఓ లుక్కేయండి..హాయిగా నవ్వుకోండి..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you