Bigg Boss:బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో సందడి త్వరలోనే మొదలుకానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు షోకి ముందు నిర్వహించనున్న “అగ్నిపరిక్ష” కార్యక్రమం కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు సామాన్యులు ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
బిగ్బాస్ కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు:
ఈసారి బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి సీరియల్ నటీనటులతో పాటు జబర్దస్త్ కమెడియన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అడుగుపెట్టనున్నారు అనే ప్రచారం జరుగుతుంది. పల్లవి గౌడ, సీనియర్ నటి రేఖ, జబర్దస్త్ నూకరాజు, పవిత్ర, ఆటో రాంప్రసాద్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ రక్షిత పేరు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరితో పాటు ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ నటుడు బాలు విష్ణు పేరు కూడా బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తోంది. దీంతో వీరి ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
also read:I Nobody :‘ఐ నోబడీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. పృథ్వీరాజ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
బాలు విష్ణు పై అభిమానుల్లో టెన్షన్:
ప్రస్తుతం గుండె నిండా గుడిగంటలు సీరియల్ బుల్లితెరపై మంచి ఆదరణ పొందుతుంది. ఇందులో మీనా, బాలు పాత్రలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలు పాత్రలో నటిస్తున్న విష్ణు తన కామెడీ టైమింగ్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఆయన సీరియల్ ను వదిలి బిగ్ బాస్ లోకి వెళ్తున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ విషయంపై బాలు విష్ణు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
also read:Toxic:‘టాక్సిక్’లో నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఇతడే!?
బిగ్బాస్ ఎంట్రీ పై క్లారిటీ:
నేను గుండెనిండా గుడి గంటలు సీరియల్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్లు, రీల్స్ చూశాను. దాదాపు 4,000 మంది కామెంట్లు చేశారు. చాలామంది వ్యక్తిగతంగా మెసేజ్ లు కూడా చేశారు. సీరియల్ వదిలి వెళ్ళొద్దని మీరు లేకుండా ఆ పాత్ర మరో చూడలేమని ప్రేమగా చెప్పారు. నేను బిగ్ బాస్ కి వెళ్లడం లేదు. మీరు కోరుకున్నట్లుగానే ఎప్పటికీ బాలు లాగే మీ ముందుంటాను. బాలు పాత్రలోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మన సీరియల్ పై మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై కూడా ఇదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని బాలు విష్ణు తెలిపారు. దీంతో బాలు విష్ణు బిగ్ బాస్ 10 లోకి వెళ్తున్నారని ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
https://www.instagram.com/reel/DbzlRBPpaLs/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




