Wednesday, August 12, 2026
HomeLATESTTrisha:ఈ వయసులో సిగ్గుచేటు అంటూ త్రిష సంచలన పోస్ట్..!

Trisha:ఈ వయసులో సిగ్గుచేటు అంటూ త్రిష సంచలన పోస్ట్..!

Trisha: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న త్రిష సడన్గా తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్న పోస్ట్ అనుమానాలను రేకెత్తిస్తోంది.

on
- Advertisement -banner Ad

Trisha:హీరోయిన్ త్రిష పేరు గత కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాలలో ఏదో ఒక విషయంలో వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఈమె పేరు వార్తలలో నిలుస్తూనే ఉంది. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ కోర్టులో అప్లై చేయడంతో విడాకుల పిటిషన్లో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ చెప్పడం.. విజయ్ – త్రిష మధ్య సంథింగ్ ఉందంటూ పలు రకాలుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కూడా విజయ్ పేరు, త్రిష(Trisha) పేరుతో పలు రకాల వ్యాఖ్యలు కూడా చేశారు.

అనుమానాలు రేకెత్తిస్తున్న త్రిష పోస్ట్..

ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల విషయంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో విజయ్ , సంగీత కలిసిపోతున్నారనే వార్తలు మరింత వైరల్ గా మారాయి. ఇటువంటి తరుణంలోనే త్రిష తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ తమిళ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వయసులో అనవసరమైన డ్రామాలు చేయడం సిగ్గుచేటు.. వెళ్లి కొంత డబ్బు సంపాదించండి. ప్రశాంతంగా జీవించండి అంటూ త్రిష తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది..

- Advertisement -
Advertisement

also read:Bigg Boss:బిగ్ బాస్‌ 10పై బాలు సంచలన క్లారిటీ.. ఫ్యాన్స్‌కు అసలు విషయం చెప్పేశాడు..!

ఎవరిని ఉద్దేశించి?

మరొక కొటేషన్ లో ఒకప్పుడు మనం ప్రార్ధించిన జీవితం మనకు లభించడం ఎంతటి అదృష్టం అంటూ పంచుకుంది త్రిష.. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి ఇలా చేసింది అనే విషయం పైన సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు మొదలవుతున్నాయి. గడచిన కొద్ది రోజుల క్రితం ప్రతిపక్షనేత ఉదయనిది స్టాలిన్ కావేరి నిరసన ప్రదర్శనలో భాగంగా మాట్లాడుతూ త్రిష ను ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడంతో తమిళనాడులో సంచలనం గా మారింది. ఈ విషయం పైన అరెస్టు కూడా చేశారు. ఈ వివాదం పూర్తిగా సద్దుమనగక ముందే త్రిష పైన అన్న డీఎంకే నేత ఆర్పి ఉదయ్ కుమార్ కూడా పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
Advertisement

also read:I Nobody :‘ఐ నోబడీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. పృథ్వీరాజ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

తమిళనాడు రాజకీయాలలో త్రిష హాట్ టాపిక్..

జయలలిత పేరవై సమావేశంలో ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం విజయ్ తన ప్రేయసి అయిన త్రిషను డిప్యూటీ సీఎం గా ఎప్పుడు నియమిస్తారో చూడాలని తమిళనాడు మొత్తం కూడా ఎదురు చూస్తుందంటూ పలు రకాల వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా త్రిష తన మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే ఇలాంటి కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఉదయనిది స్టాలిన్ తన పైన అభ్యంతరకరమైన కామెంట్స్ చేసిన స్పందించలేదు. అలాగే విజయ్ పై ఆయన భార్య సంగీత పెట్టిన విడాకుల కేసు కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని త్రిష పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు అందరిని ఆకర్షించింది. మరి త్రిష ఎవరికి కౌంటర్ వేసింది అనే విషయంపై నేటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you