I Nobody :పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఐ నోబడీ’ మూవీకి సంబంధించిన పోస్టర్ లేదా స్టిల్. క్రైమ్, హీస్ట్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను హైలైట్ చేసేలా జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ వివరాలతో కూడిన విజువల్.
మలయాళీ చిత్రాలకు ఈ మధ్యకాలంలో తెలుగులో ఎలాంటి డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ అంశాలతో తెరకెక్కిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఓ సినిమా హైలెట్ గా అభిమానులను ఆకట్టుకుంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ నోబడీ’ (I Nobody )ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
విభిన్న అంశాల సమ్మేళనంగా ఐ నోబడి:
రోర్‌షాక్’, ‘కెట్టియోలాను ఎంటె మాలాఖ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నిజాం బషీర్ ఈ సినిమాను తెరకెక్కించారు. కుటుంబ భావోద్వేగాలు, సోషల్ మీడియా ప్రభావం, సామాజిక రాజకీయ వ్యంగ్యాన్ని మేళవిస్తూ కథను రూపొందించారు. ఇదే సినిమాకి హైలైట్ పాయింట్. నేపథ్యంలో సాగే ఈ కథలో రాజీవన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభుత్వ ఉద్యోగిగా, భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు పిల్లలతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు . అయితే అనుకోకుండా ఓ బ్యాంకు దోపిడీకి ప్రత్యక్ష సాక్షిగా మారడంతో అతడి జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.
also read:Toxic:‘టాక్సిక్’లో నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఇతడే!?
నిందలు, సోషల్ మీడియా ప్రభావం:
దోపిడికి పాల్పడిన వ్యక్తులు తమ గుర్తింపు బయటపడకూడదనే ఉద్దేశంతో రాజీవ్ను కిడ్నాప్ చేస్తారు. అతడు కనిపించకుండా పోవడంతో బ్యాంకు దోపిడీ లో రాజీవ్ను కూడా సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెడతారు. తగిన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని నిందించడం సోషల్ మీడియాలో వ్యాపించే ఆపోహలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది సినిమా మెయిన్ పాయింట్. ఈ అంశాన్ని సినిమాలో ఆసక్తికరంగా చూపించారు డైరెక్టర్. తనపై పడిన మచ్చను తొలగించుకుని నిజాయితీని నిరూపించుకునేందుకు రాజీవ్ చేసే పోరాటం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
also read:Hero suriya:విశ్వనాథ్ అండ్ సన్స్ అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఎంత?
థ్రిల్లింగ్ ప్రశ్నలతో కథనం:
పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు తమ పాత్రలకు న్యాయం చేశారు. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠ భరిత సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. రమేష్ ఎంపీ ఎడిటింగ్ కథనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లింది. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ఊహించని మలుపులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆగస్టు 20 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ :
జులై 9న థియేటర్లలో విడుదలైన “ఐ నోబడి” కి ఐ ఎమ్ డి బి లో 6.2 రేటింగ్ నమోదయింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 20 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం తో పాటు తెలుగు, తమిళం, హిందీ ,కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు మేకర్స్.
వారణాసిలో కీలక పాత్రలో పృథ్వీరాజ్ :
మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వారణాసి” సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన “కుంభ” అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో “ఐ నోబడి” ఓటిటి విడుదలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




