Friday, August 14, 2026
HomeLATESTNavdeep:అగ్ని పరీక్షకు పిలిచి అవమానించారు.. ఉప్పల్ బాలు షాకింగ్ వీడియో..!

Navdeep:అగ్ని పరీక్షకు పిలిచి అవమానించారు.. ఉప్పల్ బాలు షాకింగ్ వీడియో..!

Navdeep: ప్రముఖ సినీ నటుడు నవదీప్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష 2 లో జడ్జిగా వ్యవహరిస్తుండగా.. ఉప్పల్ బాలు తనను అవమానించినట్లు వీడియో విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Navdeep:బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కావడానికి మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇప్పటికే అగ్నిపరీక్ష సెలక్షన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఈసారి కూడా సామాన్యులకు పెద్దపీటవేసేలా ప్లాన్ చేసిన బిగ్బాస్ టీమ్. గత సీజన్ లో కూడా కామనర్స్ ను హౌస్ లోకి తీసుకువచ్చారు. అలా సామాన్యుడిగా వెళ్లిన కళ్యాణ్ ఏకంగా విన్నర్ అయ్యారు. దీంతో ఈసారి హౌస్ లోకి వెళ్లడానికి సామాన్యులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా జరిగిన అగ్ని పరీక్ష 2 ఆడిషన్స్ లో ప్రముఖ యూట్యూబర్స్ తో పాటుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది హాజరయ్యారు.

నవదీప్ పై ఉప్పల్ బాలు మండిపాటు..

అందులో ఉప్పల్ బాలు కూడా ఒకరు. అతనికి సంబంధించి ప్రోమోను కూడా బిగ్ బాస్ టీం విడుదల చేశారు. కానీ ఇందులో ఉప్పల్ బాలు సెలెక్ట్ కాలేదు. ఆడిషన్ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత ఉప్పల్ బాలు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. సామాన్యుడిగా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను చాలా కష్టపడి పైకి వచ్చానని , అలాగే మిడిల్ క్లాస్ వాళ్లకు ఎదిగే అవకాశం ఇవ్వలేదని, తన వీడియోలు వల్గర్ గా ఉంటాయని రిజెక్ట్ చేశారంటూ ఉప్పల్ బాలు ఆవేదనతో వీడియోని పంచుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Agadha:అగధ మూవీ రివ్యూ: హారర్ మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

సామాన్యులు అంటే అంత చులకనా..

చాలా కష్టపడి అగ్ని పరీక్షలో అన్ని పాస్ అవుతూ వచ్చిన తనకు చివరి విషయంలో ఎలాంటి టాస్క్ గాని గేమ్ గాని ఇవ్వకుండా కేవలం మీ వీడియోలు వల్గర్ గా ఉంటాయని ఈ వీడియోలు దేనికి పనికొస్తాయి అంటూ అడిగారని తెలిపారు బాలు.. నవదీప్(Navdeep) గురించి మాట్లాడుతూ.. మీరు నన్ను అడిగారు కదా మరి మీ వీడియోలు దేనికి పనికొస్తాయి అండి? మీరు ఎవరికైనా దానం చేశారా? మరెవరికైనా సహాయం చేశారా ? మేము మిడిల్ క్లాస్ వాళ్ళము.. ఏమి చేయలేమని అనుకుంటున్నారు.. మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు.. అదే అవకాశం ఇవ్వకపోతే వెళ్లరు కదా అంటూ ఉప్పల్ బాలు ప్రశ్నించారు.

- Advertisement -
Advertisement

also read:Surya:సూర్య-మమితా బైజు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ..!

పాపం ఖచ్చితంగా పండుతుంది..

అగ్ని పరీక్షకు పిలిచి అవమానించడం సరికాదు అని , దీనిని నేను అసలు వదిలిపెట్టను.. పాపం అనేది కచ్చితంగా తగులుతుంది నాకు న్యాయం జరగాలి అంటూ ఉప్పల్ బాలు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ సైతం పలు రకాలుగా ఈ వీడియో పైన స్పందిస్తున్నారు. మరి ఈ విషయం పైన అగ్ని పరీక్ష జడ్జిలుగా ఉన్న ఒకరిలో నవదీప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/reel/Db-dFDrtfxL/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you