Tuesday, July 21, 2026
HomeLATESTVarun Tej:మెగా హీరో కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!

Varun Tej:మెగా హీరో కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!

Varun Tej: కొరియన్ కనకరాజు సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో చేతి కర్రతో కనిపించే అందరిని ఆశ్చర్యపరిచారు వరుణ్ తేజ్.

on
- Advertisement -banner Ad

Varun Tej:మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్లో ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలతోనే మెప్పిస్తున్నారు. కానీ గత కొంతకాలంగా వరుణ్ తేజ్ నటించిన సినిమాలేవి కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో అభిమానులు సైతం నిరుత్సాహంతో ఉన్నారు. అయితే వరుణ్ తేజ్ ఆశలన్నీ కూడా కొరియన్ కనకరాజు సినిమా పైన పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం గమనార్హం. వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.

చేతి కర్ర సహాయంతో స్టేజ్ పైకి వచ్చిన వరుణ్ తేజ్..

ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం వేగాన్ని పెంచారు. ఇటీవలే ఈ సినిమా మ్యూజికల్ జర్నీ ని స్టార్ట్ చేస్తూ మొదటి పాటను కూడా విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండవ పాటను కూడా విడుదల చేయడానికి ఒక కార్యక్రమాన్ని అనంతపురంలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు వరుణ్ రావడం అభిమానులకు ఆనందం కలిగినా.. వరుణ్ తేజ్ చేతిలో కర్ర పట్టుకొని మరీ నడుస్తూ వేదిక పైకి రావడం అక్కడున్న వారందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

- Advertisement -
Advertisement

also read:Nayanthara :నయనతార ‘హాయ్’ మూవీకి భారీ డీల్.. రిలీజ్‌కు ముందే షాకింగ్ అనౌన్స్‌మెంట్!

గాయం పై వివరణ ఇచ్చిన వరుణ్ తేజ్..

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్(Varun Tej) తన కాలికి గాయం అయిందని ఆ గాయం గురించి అసలు విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలలో పాటల కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన కాలికి ఒక గాయం అయ్యిందని వరుణ్ తేజ్ తెలియజేశారు. వరుణ్ తేజ్ కాలికి గాయం తగిలిందని తెలిసి అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలా గాయమైనప్పటికీ కూడా సినిమా ప్రమోషన్స్ కోసం అనంతపురం కి రావడం పై ఆయన డెడికేషన్ ని మెచ్చుకుంటున్నారు అభిమానులు.

- Advertisement -
Advertisement

also read:Aishwarya Lekshmi:ట్రోల్స్‌తో విరక్తి.. ‘వంద కోట్లు ఇచ్చినా రాను’ అంటూ ఐశ్వర్య లక్ష్మి స్ట్రాంగ్ స్టేట్‌మెంట్!

చెల్లెలిని నిర్మాణంలో వరుణ్ తేజ్ కొత్త మూవీ..

తమ హీరో గాయం నుంచి త్వరగా కోలుకోవాలని వరుణ్ తేజ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో కూడా బరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే వాలీబాల్ కథ అన్నట్లుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వరుణ్ తేజ్ కి గాయం అవ్వడంతో చిన్నపాటి సర్జరీ కూడా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అలా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు మళ్లీ ఇలా గాయపడ్డారు. అయినా సరే కొరియన్ కనకరాజు సినిమా ప్రమోషన్స్ కోసం బయటికి వచ్చారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you