Tuesday, July 21, 2026
HomeLATESTNayanthara :నయనతార 'హాయ్' మూవీకి భారీ డీల్.. రిలీజ్‌కు ముందే షాకింగ్ అనౌన్స్‌మెంట్!

Nayanthara :నయనతార ‘హాయ్’ మూవీకి భారీ డీల్.. రిలీజ్‌కు ముందే షాకింగ్ అనౌన్స్‌మెంట్!

Nayanthara :నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'హాయ్' చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకుంది.

on
- Advertisement -banner Ad

Nayanthara :క్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం “హాయ్” విడుదలకు ముందే మరో కీలక అప్డేట్ తో సినీ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది. థియేటర్ రిలీజ్ తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం ZEE5లోనే స్ట్రీమింగ్ కానుంది అంటూ అధికారికంగా వెల్లడైంది.

ZEE5 సొంతం చేసుకున్న డిజిటల్ హక్కులు :

“హాయ్” సినిమా పోస్ట్ థియేటర్ డిజిటల్ హక్కులను ZEE 5 దక్కించుకుంది ఈ విజయాన్ని సంస్ధ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించింది. అయితే సినిమా ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందని తేదిని మాత్రం ఇంకా వెల్లడించలేదు. సాధారణంగా థియేటర్ విడుదల అనంతరం కొన్ని వారాల తర్వాత స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. విడుదల తేదీ పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
Advertisement

also read:Aishwarya Lekshmi:ట్రోల్స్‌తో విరక్తి.. ‘వంద కోట్లు ఇచ్చినా రాను’ అంటూ ఐశ్వర్య లక్ష్మి స్ట్రాంగ్ స్టేట్‌మెంట్!

నయనతార , కవిన్ కొత్త కాంబినేషన్ :

ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ, ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార తో పాటు యువ నటుడు కవీన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కవిన్, నయనతారతో తొలిసారి కలిసిన నటిస్తూ ఉండడంతో ఈ జంటపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -
Advertisement

also read:Salman Khan :వైరల్ వీడియోతో సల్మాన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. అసలు నిజం ఏంటి?

ప్రముఖ నిర్మాణ సంస్థల నిర్మాణం :

‘హాయ్’ (Hi Movie)చిత్రాన్ని నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్‌తో పాటు సెవెన్ స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు జెన్ మార్టిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది.

- Advertisement -
Advertisement

త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన:

ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే ట్రైలర్, పాటలు ఇతర ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థకు దక్కడంతో “హాయ్” సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన అనంతరం ZEE5 ద్వారా మరింత స్థాయిలో ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you