OTT movies:కొత్త వారం మొదలైందంటే చాలు ఓటీటీలలో సందడి చేసే చిత్రాలు , వెబ్ సిరీస్ లు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వీకెండ్స్ లో ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని అటు డిజిటల్ స్ట్రీమింగ్ కి ఎన్నో సినిమాలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలాగే జూన్ ఆఖరి వారం కూడా ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోయాయి. మరి ఈ వారం ఏ ఏ ప్లాట్ఫారం వేదికగా ఎలాంటి చిత్రాలు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతున్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.
జియో హాట్ స్టార్:
ప్రముఖ దిగ్గజ ఓటీటీ నెట్వర్క్ గా గుర్తింపు తెచ్చుకున్న జియో హాట్ స్టార్ వేదికగా జూన్ 22న ఏజెన్సీ సీజన్ 2 ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీంతోపాటు తెలుగు డబ్బింగ్ సినిమా అవతార్ 3(Avatar 3) జూన్ 24న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాగా.. జూన్ 26న తెలుగు డబ్బింగ్ సిరీస్ లింగం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది.
also read:Dhanush:ప్రేమే లేని చోట బ్రేకప్ ఏంటి.. తెర వెనుక అసలు నిజం!
నెట్ ఫ్లిక్స్:
దిగ్గజ ఓటిటి ప్లాట్ఫారం గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ లో ఈసారి సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే ఇంగ్లీష్ సిరీస్ అనదర్ లైఫ్ సీజన్ 3 జూన్ 24న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుండగా.. మరొకవైపు అదే రోజు ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే అనే ఇంగ్లీషు సినిమా కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఇక జూన్ 25న తెలుగు డబ్బింగ్ సినిమా బ్లాస్ట్, జూన్ 26న ఇంగ్లీష్ సినిమా క్రిస్మ్ అండ్ మార్టినా, జూన్ 26న తెలుగు డాక్యుమెంటరీ సిరీస్ బాహుబలి ద టార్చ్ బేరర్(Baahubali the torch bearer) కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది . అంతేకాదు జూన్ 27న హిందీ సిరీస్ లాక్ అప్ సీజన్ 2 కూడా అందుబాటులోకి రాబోతూ ఉండడం గమనార్హం.
అమెజాన్ ప్రైమ్:
అమెజాన్ ప్రైమ్ లో నేడు తెలుగు డబ్బింగ్ సిరీస్ హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 స్ట్రీమింగ్ కి రాగా .. మరో తెలుగు డబ్బింగ్ సిరీస్ గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 రేపు స్ట్రీమింగ్ కి రాబోతోంది. అలాగే హిందీ సిరీస్ అలియన్స్ జూన్ 26న డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం కాబోతోంది.
also read:Aamir Khan : మూడో పెళ్లి ప్రకటన చేసిన మిస్టర్ పర్ఫెక్ట్.. పెళ్లెప్పుడు అంటే?
జీ 5:
ప్రేమలా కండిషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) జూన్ 26
మమ్మటియాన్ స్టార్స్ (తమిళ్ సిరీస్) జూన్ 26
ముతస్సీ (మలయాళ సిరీస్) జూన్ 26 స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.
లయన్స్ గేట్ ప్లే:
బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) జూన్ 26
ద యెతి (ఇంగ్లీష్ సినిమా) జూన్
థిస్ ఇస్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్ )జూన్ 26
సోనీ లివ్:
పర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) జూన్ 26


