Saturday, June 27, 2026
HomeLATESTFilm industry: ఇద్దరు హీరోయిన్స్ నడుమ డాన్స్ తో అదరగొట్టేస్తున్న మెగాస్టార్!

Film industry: ఇద్దరు హీరోయిన్స్ నడుమ డాన్స్ తో అదరగొట్టేస్తున్న మెగాస్టార్!

Film industry: మెగాస్టార్ తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో అదిరిపోయేలా డాన్స్ చేసి ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే అంటూ నిరూపించారు.

on
- Advertisement -banner Ad

Film industry: చాలామంది సెలబ్రిటీలు స్టేజ్ పైన డాన్స్ వేయడం చాలా అరుదు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించిన మోహన్ లాల్ వంటి సీనియర్ హీరోలు స్టేజ్ పైన డాన్స్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 65 ఏళ్ల వయసులో కూడా స్టేజ్ పైన మరింత ఉత్సాహంగా డాన్స్ వేస్తూ.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనేటట్టుగా డాన్స్ తో మైమరిపించారు మోహన్ లాల్. ప్రస్తుతం మోహన్ లాల్ వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

డాన్స్ తో అదరగొట్టేసిన మోహన్ లాల్..

అసలు విషయంలోకి వెళ్తే… జర్మనీలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ లాల్ అక్కడికి వచ్చిన ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమాలోని మనోహరి అనే సాంగ్ కి డాన్స్ వేస్తూ హైలెట్గా నిలిచారు. ఇద్దరు నటీమణులతో కలిసి మోహన్ లాల్(Mohan lal) స్టేజ్ పైన ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ చేయడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఒరిజినల్ గా ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు నటీమణులతో కనిపించగా.. మోహన్ లాల్ మాత్రం కేవలం ఇద్దరు నటీమణులతో కలిసి తనదైన స్టైల్ లో డాన్స్ వేసి మరీ హైలెట్ అయ్యారు.

- Advertisement -

also read:Kollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత..!

స్వయంగా పాటలు పాడి..

మోహన్ లాల్ డాన్స్ తోనే కాకుండా కొన్ని పాటలు పాడి మరీ ప్రేక్షకులను మరింత ఆనందపరిచారు. ఈ పాటను ప్రభాస్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ.. మోహన్ లాల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలి పాటలు భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

also read:Jabardast Mahesh:ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు మహేష్!

మోహన్ లాల్ సినిమాలు..

చివరిగా మోహన్ లాల్ సినిమాల విషయానికే వస్తే.. దృశ్యం 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించింది. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ భాషతో సంబంధం లేకుండా పలు భాషా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ పాన్ ఇండియా సెలబ్రిటీగా పేరు దక్కించుకున్నారు.

- Advertisement -

#MohanLal – DANCE WITH TWO ACTRESS FOR BAAHUBALI SONG – From #Prabhas Film 😜😜💥💥pic.twitter.com/UYdLnP8AxQ

— GetsCinema (@GetsCinema) June 27, 2026

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you