Balakrishna :నందమూరి నటసింహం బాలకృష్ణ కుటుంబం కి సినీ ఇండస్ట్రీలో ఎలాంటి గౌరవం ఉందో అందరికి తెలుసు. ఆ ఫ్యామిలీ నుడి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కొత్త ముఖం తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె మరెవరో కాదు.. బాలకృష్ణ (Balakrishna )పెద్ద కుమార్తె తేజస్వి వెండితెరపై నటిగా పరిచయం కానున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా?:
వినిపిస్తున్న సమాచారం ప్రకారం తేజస్వి తొలి చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా యువతకు స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కథా చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని, స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత ఇతర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
ALSO READ:TV:టీవీ ప్రేక్షకులకు పండగే.. శుక్రవారం ప్రసారమయ్యే బ్లాక్‌బస్టర్ సినిమాల జాబితా ఇదే!
మోక్షజ్ఞ కంటే ముందే తేజస్వి?:
బాలకృష్ణ వారసత్వం గురించి మాట్లాడినప్పుడు అభిమానుల దృష్టి ఎక్కువగా ఆయన కుమారుడు మోక్షజ్ఞపైనే ఉండేది. మోక్షజ్ఞ హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తాడనే అంచనాలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తేజస్వి ముందుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు రావడంతో నందమూరి అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది.
ALSO READ:Ramayana Trailer:రామాయణ ట్రైలర్ లో ఆ ఇద్దరిని దాచేశారా?.. సోషల్ మీడియాలో భారీ చర్చ!
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు:
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకే ఈ వార్త ప్రచారంలో ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ, దర్శకుడు లేదా బాలకృష్ణ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దీంతో ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే నందమూరి కుటుంబం నుంచి మరో కొత్త ప్రతిభ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమవుతుంది. అభిమానులు కూడా తేజస్వి వెండితెరపై ఎలా కనిపించబోతుందో అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.




