Sunday, July 5, 2026
HomeOTT NEWSOTT Movies:ఓటీటీలోకి వచ్చిన ప్రేమలు హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ!

OTT Movies:ఓటీటీలోకి వచ్చిన ప్రేమలు హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ!

OTT Movies: ప్రేమలు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నస్లేన్ తాజాగా సైకాలజికల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

on
- Advertisement -banner Ad

OTT Movies: ప్రతివారం అటు ఓటీటీలో, థియేటర్లలో సరికొత్త సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈవారం కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. హ్యాంగ్ మ్యాన్, సూపర్ సుబ్బు, ఇసక పట్నం, మర్మదేశం వంటి ఎన్నో చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితోపాటుగా మలయాళం నుంచి రెండు తెలుగు డబ్బింగ్ వర్షన్ చిత్రాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. అందులో ఒకటి కరక్కం మూవీ, మరొకటి ప్రేమలు హీరో (నస్లేన్) నటించిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం మాలీవుడ్ టైమ్స్. మరి అది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

మాలీవుడ్ టైమ్స్ మూవీ స్టోరీ..

స్టోరీ విషయానికి వస్తే.. స్పిల్ బర్గ్, ఆర్జీవి దర్శకుల స్ఫూర్తితో ఇండస్ట్రీలో రాణించాలనుకుంటారు హీరో నస్లేన్(naslen). అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ గా తనకి ఒక మంచి అవకాశం లభిస్తుంది. అయితే తన మొదట ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా తెరకెక్కించాలని ఆలోచిస్తుంటారు. కానీ అంతలోనే ఒక ట్విస్ట్.. తన కథను వేరే వ్యక్తి ముందే తీస్తారు.. దీంతో అతను మానవత్వం, జాలి అన్ని వదిలేసి ఒక సైకోలాగా మారుతారు. ఆ తర్వాత నస్లేన్ ఏం చేస్తారు అన్నది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -

దూసుకుపోతున్న మాలీవుడ్ టైమ్స్..

నస్లేన్ నటించినటువంటి ఈ సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ చిత్రం పేరు “మాలీవుడ్ టైమ్స్”(Mollywood Times). అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, సంగీత్ ప్రతాప్, వినీత్ శ్రీనివాస్, రాజేష్ మాధవన్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రానికి అభినవ్ సుందర్ నాయక్, రాము సునీల్ కలిసి కథ అందించారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ ఓటీటి ప్లాట్ఫార్మ్లలో ఒకటైన జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, హిందీ, తమిళ్ , కన్నడ వంటి భాషలలో కూడా స్ట్రిమింగ్ అవుతోంది.

also read:Mahesh Babu:27 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న మహేష్ బాబు సెంటిమెంట్.. జయకృష్ణకు కలిసి వస్తుందా?

- Advertisement -

నస్లేన్ సినిమాలు..

నస్లేన్ సినిమాల విషయానికి వస్తే.. 2019లో మధుర రాజ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన నస్లేన్ ప్రేమలు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు, ఆ తర్వాత జిమ్ ఖానా, లోక, తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు మాలివుడ్ టైమ్స్ సినిమాతో మరొకసారి ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే టీకా టీకా, టార్పెడో వంటి చిత్రాలతో పాటుగా సూర్య 47వ సినిమాలో కూడా నటించబోతున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో తెలుగులో డైరెక్ట్ గా ఏదైనా సినిమాలో నటిస్తారేమో చూడాలి మరి.

also read:దేవకన్యలా అలరారుతున్న నభా నటేష్!

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you