Wednesday, July 22, 2026
HomeLATESTTollywood: బాలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చేస్తున్న గీతా గోవిందం డైరెక్టర్!

Tollywood: బాలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చేస్తున్న గీతా గోవిందం డైరెక్టర్!

Tollywood: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తో గీతా గోవిందం సినిమా చేసి మంచి విజయం అందుకున్న డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ హీరో తో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Tollywood: సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని సినిమాలు తీసినా.. స్టార్డం రావడం కష్టంగానే ఉంటుంది. మరి కొంతమంది కేవలం ఒకటి రెండు చిత్రాలతోనే స్టార్డం అందుకుంటూ ఉంటారు. అలాంటి దశలో ఉన్నవారిలో స్టార్ డైరెక్టర్ పరుశురాం కూడా ఒకరు. 2008లో వచ్చిన యువత సినిమా ద్వారా డైరెక్టర్ గా మారిన పరుశురాం( Parasuram) ఆ తరువాత ఆంజనేయులు, సోలో, గీత గోవిందం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలతో మంచి స్టార్డం అందుకున్న డైరెక్టర్ ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమా మరింత క్రేజ్ ను తెచ్చి పెట్టింది.

బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న గీతాగోవిందం డైరెక్టర్.

కానీ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో రెండవసారి తెరకెక్కించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో గత రెండేళ్లుగా ఎలాంటి కొత్త ప్రాజెక్టు కూడా ప్రకటించలేదు. గతంలో గీతాగోవిందం సీక్వెల్ వస్తుంది అంటూ వార్తలు వినిపించినా.. ఇప్పటివరకు వాటి గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ పరుశురాముకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక విషయం ట్రెండీగా మారింది. అదేమిటంటే టాలీవుడ్(Tollywood) పరిధిని దాటి ఏకంగా బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:OTT Movies:ఓటీటీలోకి వచ్చిన ప్రేమలు హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ!

హృతిక్ రోషన్ తో కొత్త మూవీ..

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హృతిక్ రోషన్(hrithik roshan). తో డైరెక్టర్ పరుశురాం ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎమోషనల్ డ్రామా సినిమాని ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, సినిమా కథ విన్న హృతిక్ రోషన్ స్క్రిప్ట్ పట్ల చాలా సానుకూలతను తెలియజేసినట్లుగా బాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హిందీ మార్కెట్తో పాటుగా దక్షిణాది మార్కెట్ ను కూడా పెంచేలా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Nabha natesh:దేవకన్యలా అలరారుతున్న నభా నటేష్!

ఫిక్స్ అయితే సూపర్ హిట్ గ్యారెంటీ..

హృతిక్ రోషన్, డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్లో రాబోతున్న సినిమా వెనుక ప్రముఖ సక్సెస్ఫుల్ ప్రోడక్షన్ హౌస్ ఉందని అదే హోంభలే ఫిలిమ్స్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్, నార్త్ అని తేడా లేకుండా వరుసగా పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్ ఇటీవలే తమిళ స్టార్ హీరో సూర్యతో కూడా ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. ప్రస్తుతం హృతిక్ రోషన్, డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి సంబంధించి ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఫైనల్ వర్షన్ ను సిద్ధం చేసే పనిలో డైరెక్టర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక నిజమైతే డైరెక్టర్ పరశురామ్ కెరియర్ లోనే ఈ సినిమా మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉంటుందని టాలీవుడ్ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you