Tuesday, July 21, 2026
HomeLATESTSalman Khan :వైరల్ వీడియోతో సల్మాన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. అసలు నిజం ఏంటి?

Salman Khan :వైరల్ వీడియోతో సల్మాన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. అసలు నిజం ఏంటి?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సన్నగా, అలసటగా కనిపించడంతో అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

on
- Advertisement -banner Ad

Salman Khan :బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆరోగ్యం పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆందోళనలకు గురిచేస్తుంది. ఎప్పుడు ఫిట్ గా.. ఉత్సాహంగా కనిపించే సల్మాన్ ఈసారి కాస్త సన్నగా, అలసటగా కనిపించడంతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

వైరల్ అయిన వీడియో :

ముంబైలోని స్లమ్ రీ హ్యాబిలిటేషన్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధునిక డేటా కలెక్షన్, వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్ ను సల్మాన్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆయన రూపంలో వచ్చిన మార్పును గమనించారు. కొందరు బరువు తగ్గారని మరికొందరు వయసు ప్రభావమే కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Advertisement

గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు:

సల్మాన్ ఖాన్ గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి తీవ్రమైన ముఖ నొప్పిని కలిగిస్తుండటంతో దీనిని కొందరు “సూసైడ్ డిసీజ్” అని కూడా పిలుస్తారు. ఈ సమస్యకు విదేశాలలో చికిత్స తీసుకున్నట్లు సల్మాన్ గతంలో టాక్ వినిపించింది. అలాగే మెడకు సంబంధించిన సమస్యలతో కూడా ఆయన చికిత్స పొందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ కి.. ఆ పాత ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉందా అనే చర్చ కూడా కొనసాగుతుంది.

also read:Tollywood:సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

- Advertisement -
Advertisement

ట్వీట్ తో అభిమానుల్లో ఆసక్తి:

ఇటీవల సల్మాన్ ఖాన్(Salman Khan )తన సోషల్ మీడియా ఖాతాలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకుంటూ “Aap logon ki tabiyat kaisi hai?” (మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?) అని అభిమానులను ప్రశ్నించారు. దీంతో అభిమానులు కూడా స్పందిస్తూ ..”ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి భాయ్..?” అంటూ కామెంట్లు చేశారు. మరి కొందరు ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని దేవుడికి ప్రార్థనలు కూడా చేశారు.

also read:Tollywood: గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కి ఆ టాలీవుడ్ హీరోయిన్ ముని మనవరాలా?

- Advertisement -
Advertisement

కొత్త సినిమాలు తో బిజీ :

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అపూర్వ లిఖియా అదర్శకత్వంలో రూపొందుతున్న “మాతృభూమి” చిత్రంలో భారత సైన్యానికి చెందిన కల్నల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నయనతార తో కలిసి నటించబోతున్నారు అని సమాచారం. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే అభిమానులు మాత్రం సినిమాల కంటే ముందు సల్మాన్ ఆరోగ్యంపై అధికారిక సమాచారం రావాలని ఎదురుచూస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you