Samantha:స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన సమంత తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సమంత , నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని, విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్న సమంత.. ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి రెండవ వివాహం గత ఏడాది డిసెంబర్ 1న చేసుకుంది .అనంతరం పలు సినిమాలలో నటించిన సమంత.. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఏకంగా తన కెరీర్ లోనే రూ.100 కోట్లు అందుకున్న మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భారీగానే కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
బేబీ బంప్ తో దర్శనం ఇచ్చిన సమంత..
ఇక అనంతరం సమంత (Samantha)తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ వుంది సమంత. తాజాగా తన ఇంస్టా గ్రామ్ లో ఈ ఫోటో షూట్ కు సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఫోటోలకు ఒక కొటేషన్ ని రాసుకుంది. మస్టర్డ్ ఎల్లో కలర్ బాడీ కాన్ కేవ్ గౌనులో ఉన్న ఫోటోలను సమంత షేర్ చేస్తూ బేబీ బంప్ ఫోటో ని హైలైట్ గా చేసింది. 39 ఏళ్ల వయసులో కూడా సమంతలో కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.
ALSO READ:OTT:ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర.. ఆగస్టు 4 నుంచి ఫుల్ గా కొత్త సినిమాలు..!
జీవితంలో వచ్చే దశలను ఎంచుకోలేం – సమంత
ఇక ఫోటోలతో పాటుగా సమంత చేసిన కొటేషన్ అందర్నీ ఆకట్టుకుంది.. “ప్రతి దశ ఒకేలా ఉండదు. కొన్ని దశలు వేచి ఉండమంటాయి.. మరికొన్ని పోరాడమంటాయి మరికొన్ని వదిలేయమంటాయి.. మన జీవితంలో వచ్చే దశలను మనం ఎంచుకోలేము. కానీ ఎలా జీవించాలో మాత్రం మనమే నిర్ణయించుకుంటామంటూ” సమంత ఎమోషనల్ గా ఒక కొటేషన్ రాసుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. అంతేకాకుండా సమంత కొత్త జీవితానికి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:Monday tv Movies:ఈరోజు టీవీల్లో ఫుల్ సందడే సందడి..
బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్న సామ్ – రాజ్ దంపతులు..
సమంత మా ఇంటి బంగారం చిత్రం తర్వాత మరే సినిమాలను ఒప్పుకోలేదు. సుమారుగా ఒక ఏడాది పాటు విశ్రాంతి తీసుకొని.. ఆ తర్వాత తాను సినిమాలు చేస్తానంటూ ప్రకటించింది. ఇక తన భర్తతో కలిసి పలు సినిమాలను నిర్మించేలా ప్లాన్ చేస్తోంది సమంత. ప్రస్తుతం సమంత, రాజ్ నిడుమోరు తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది డిసెంబర్ చివరిలో తమ మొదటి బిడ్డకు సమంత జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంతకి సంబంధించి ఈ న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/DbiCPFqjpzB/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




