Jr NTR:టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఎన్టీఆర్ మేజర్ సర్జరీ కి సిద్ధమయ్యారు. ఇటీవలే సినిమా షూటింగ్లో ఆయన గాయపడ్డారు. ఆయన భుజానికి గాయం అవ్వడం చేత కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు శస్త్ర చికిత్సకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది.
జూనియర్ ఎన్టీఆర్కి సర్జరీ..
హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ ఎన్టీఆర్కి (Jr NTR)సర్జరీ జరగనున్నట్లు ఆయన టీం అధికారికంగా తెలియజేసింది. సర్జరీ తర్వాత ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్లను ప్రకటిస్తామంటూ వెల్లడించింది టీమ్. ప్రస్తుతం ఈ విషయం విన్న అభిమానులు సైతం ఆందోళన పడుతున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలు రకాల పోస్ట్లు పెడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రానికి దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది.
also read:Nushrratt bharuccha:వైట్ లెహంగాలో కిర్రాక్ ఫోజులతో ఆకట్టుకుంటున్న నుస్రత్!
అధికారికంగా ప్రకటించిన ఎన్టీఆర్ కార్యాలయం..
ఈ సినిమా షూటింగ్లోని జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులు పాటు విశ్రాంతి తీసుకున్నప్పటికీ గాయం తీవ్రత ఎక్కువ అవ్వడం చేత వైద్యులు సర్జరీ చేయించుకోమని సలహా ఇవ్వడంతో రేపటి రోజున ఆయన భుజానికి వైద్యులు చికిత్స నిర్వహించబోతున్నారు. సర్జరీ కారణం చేత డ్రాగన్ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం ఇంకా పెండింగ్ ఉండడంతో అటు పోస్ట్ ఫ
పోన్ అయ్యేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
also read:Hero Vikram: చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో విక్రమ్!
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు..
మరి డ్రాగన్ సినిమా పోస్ట్ పోన్ పైన చిత్ర బృందం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ తర్వాత అభిమానులకు ఏదైనా అప్డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. చివరిగా 2024లో దేవర చిత్రంలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో 500 కోట్ల క్లబ్ లోకి చేరారు. అయితే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చిత్ర బృందం చివరిలో ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ కూడా తదుపరి చిత్రాన్ని మరో హీరోతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ మాత్రం దేవర 2 పై ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. మరి సర్జరీ తర్వాత వరుస సినిమా షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారేమో చూడాలి.
A statement from Mr. @tarak9999 ‘s office pic.twitter.com/1taRPCRuXC
— Jr NTR Fan Club (@JrNTRFC) August 11, 2026




