Wednesday, August 12, 2026
HomeLATESTHero suriya:విశ్వనాథ్ అండ్ సన్స్ అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఎంత?

Hero suriya:విశ్వనాథ్ అండ్ సన్స్ అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఎంత?

Hero suriya:సూర్య, మమితా బైజు జంటగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

on
- Advertisement -banner Ad

Hero suriya:తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ హీరోయిన్ మమత బైజూ జంటగా నటించిన చిత్రం “విశ్వనాథ్ అండ్ సన్స్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టందనా, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ అంచనాలతో సినిమా విడుదల:

లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నిమిష్ రవి సినిమా ఆటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ అందించగా శివ కామేశ్, జితూ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్లుగా పనిచేశారు. విజయ్ బిన్నీ, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
Advertisement

also read:Jr NTR:జూనియర్ ఎన్టీఆర్ కు సర్జరీ.. ఎప్పుడంటే..?

రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ :

సుమారు రూ.120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. థియేటర్ బిజినెస్ పరంగా తమిళనాడు హక్కులు సుమారు రూ.40 కోట్లు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.25 కోట్లు ఇక కర్ణాటక, కేరళ హక్కులు చెరొ ఐదు కోట్ల మీద అమ్ముడు అయినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఓవర్సీస్ హక్కులు సుమారు రూ.25 కోట్లకు విక్రయమయ్యాయి. దీంతో వరల్డ్ థియేటర్స్ విలువ దాదాపు 100 కోట్లకు ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే సుమారు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు అవసరమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Nushrratt bharuccha:వైట్ లెహంగాలో కిర్రాక్ ఫోజులతో ఆకట్టుకుంటున్న నుస్రత్!

16 నిమిషాలలో 10,000 టికెట్లు :

సూర్య(Hero suriya) నటించిన “విశ్వనాథ్ అండ్ సన్స్” అడ్వాన్స్ బుకింగ్స్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్యస్ స్పందన లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 16 నిమిషాల్లోనే 10,000 టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కొత్త రికార్డు నమోదు చేసిందని చెబుతున్నారు. ఇప్పటివరకు విజయ్ నటించిన “జననాయగన్” 17 నిమిషాలా 31 సెకండ్లలో 10000 టికెట్లు విక్రయించిన రికార్డు కలిగింది. ఇప్పుడు ఆ రికార్డును “విశ్వనాథ్ అండ్ సన్స్” బ్రేక్ చేసేసినట్లు సమాచారం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి “విశ్వనాథ్ అండ్ సన్స్” జనాలను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది..??

- Advertisement -
Advertisement

తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన:

తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రారంభంగా 150 షోలకు బుకింగ్స్ అందుబాటులోకి రాగా.. సుమారు రూ.30 లక్షల ప్రీ-సేల్స్ నమోదైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి విడుదలకు ముందు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ప్రీ-సేల్స్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you