Wednesday, September 30, 2026
HomeLATESTProducer Chaitanya Reddy:ఛార్మీ- పూరీ జగన్నాథ్ పై సంచలన విషయాలు బయటపెట్టిన నిర్మాత..!

Producer Chaitanya Reddy:ఛార్మీ- పూరీ జగన్నాథ్ పై సంచలన విషయాలు బయటపెట్టిన నిర్మాత..!

Producer Chaitanya Reddy: ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరి చార్మి తమను కోట్ల రూపాయలు మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

on
- Advertisement -banner Ad

Producer Chaitanya Reddy:డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చేయాలని చాలామంది నటీనటులు మక్కువ చూపుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే అటు నటీనటులే కాకుండా నిర్మాతలు కూడా భయపడిపోతున్నారు. ఇప్పటికే తమ సినిమాల వల్ల చాలా నష్టపోయామంటూ ఎంతో మంది బయ్యర్లు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాలలో తెలియజేశారు. పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పైన ఛార్మి ,పూరి సంయుక్తంగా నిర్మించారు.

చచ్చిపోవడం తప్ప మాకు వేరే మార్గం లేదన్నారు..

2024 ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల అవ్వగా.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాని హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ ధరకు థియేట్రికల్ హక్కులను కొనుగోలు కూడా చేశారు. సినిమా ఫ్లాప్ అవడంతో సుమారుగా 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది చైతన్య రెడ్డికి. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సమయంలో పూరి జగన్నాథ్ , ఛార్మి చచ్చిపోవడం తప్ప మాకు మరొక మార్గం లేదని చెప్పారు. కానీ సినిమా విడుదలయ్యాక తమ నెంబర్లను బ్లాక్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది చైతన్య రెడ్డి.

- Advertisement -
Advertisement

మమ్మల్ని భారీగా నమ్మించి మోసం చేశారు..

ప్రైమ్ షో ప్రొడక్షన్ కంపెనీ మాత్రమే కాదు మాది కూడా చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీనే.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవద్దని చాలామంది మాకు ముందుగానే హెచ్చరించారు.. కానీ మేము ఒక సినిమాని చంపకూడదు ఎవరైనా కష్టపడి సినిమా తీస్తే దానికి కావలసిన కష్టనష్టాలు ఏవైనా ఉంటే చూద్దామని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామని అందుకు నిరంజన్ కూడా ఒప్పుకున్నారు. దీనిలో భాగంగానే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం.. వాళ్ల పాత చిత్రాల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ డబ్బుని తర్వాత అడ్జస్ట్ చేయాలి.. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి అన్ని క్లియర్ అయితే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వారికి చాలా క్లియర్ గానే చెప్పాము.. ఆగస్టు 1వ తేదీ లోపు అన్ని ప్రాంతాలలో ఇష్యూ క్లియర్ చేసి సినిమాని మాకు ఇచ్చేయాలని తెలిపామని చెప్పుకొచ్చారు చైతన్య రెడ్డి.

పక్కా ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తోంది..

మాది సోలో ఫిలిం కాబట్టి నాలుగు రోజులు సెలవు ఇస్మార్ట్ శంకర్ సినిమా 35 కోట్లు చేసింది. డబుల్ ఇస్మార్ట్ శంకర్ 40 నుంచి 45 కోట్లు చేస్తుందని భావించాము.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరికి పెట్టిన వారే కానీ ఎవరికి నష్టం చేయలేదని బయట విన్నాము.అదే నమ్మకంతోనే అప్రోచ్ అయ్యామని.. అగ్రిమెంట్ అయినప్పుడు కూడా అంతా మంచిగానే ఉంది, ఏమన్నా జరిగితే కచ్చితంగా మేము చూసుకుంటామని హామీ ఇచ్చారు.. కానీ ఆగస్టు ఒకటవ తేదీ నాటికి ఇష్యూ సాల్వ్ కాలేదు అగ్రిమెంట్ ప్రకారం అప్పటికే మేము బయటకి వచ్చేసాము కానీ ఆగస్టు 10వ తేదీ వరకు వెయిట్ చేశాం.. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందని తెలిపారు.

- Advertisement -
Advertisement

ఎంతోమంది సలహాలు ఇచ్చినా..మేం వినలేదు..

చాలామంది మాకు ఫోన్ చేసి మీరు కొత్త వాళ్లు కదా.. వారి గురించి మీకు తెలియదు మా సైడ్ కి వచ్చేయాలి అంటూ చాలామంది ఫైనాన్షియల్ రిక్వెస్ట్ చేశారు.. అప్పటికి మాకు అర్థం కాలేదు. ఆగస్టు 10 తర్వాత నాకు చాలా తేడా కొట్టింది, ఆ సమయంలోనే ముగ్గురు ఇండస్ట్రీలో పెద్దమనుషులు తనకు ఒక సలహా ఇచ్చారు. ఏదో ఒక చిన్న ఏరియాలో తీసుకొని వదిలేయండి అంటూ సలహా ఇచ్చారని, అప్పుడు నిరంజన్ యూఎస్ఏ లో ఉన్నారు. నాకు కూడా చాలా బాధగా అనిపించింది వెంటనే 50 కోట్ల రూపాయల పెద్ద అమౌంట్ కదా ఒకసారి ఆలోచిద్దామని నేను కూడా నిరంజన్ కి చెప్పాను.. ఎప్పుడైతే వద్దు అని ప్రెషర్ చేయడం మొదలు పెట్టానో.. వాళ్ళు డైరెక్ట్ గా నిరంజన్ కె ఫోన్ చేయడం మొదలు పెట్టారని తెలిపింది చైతన్య రెడ్డి.

నిరంజన్ ను ఉక్కిరి బిక్కిరి చేశారు..

అలా ప్రతిరోజు ఛార్మి, పూరి జగన్నాథ్ ఒక గంట సేపు నిరంజన్ తో మాట్లాడేవారు. మీకు ఏమి కాదు ఏమి వచ్చినా సరే మేము నిలబడతాము. నష్టపోతే సినిమాలు చేస్తాము.. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే చచ్చిపోవడం తప్ప మాకు మరో మార్గం లేదు అంటూ నిరంజన్ ని చాలా ఉక్కిరిబిక్కిరి చేశారని చైతన్య రెడ్డి తెలిపింది.. ఆగస్టు 13న నేను ఒక చెక్ మీద కూడా సంతకం పెట్టాను. నేను ఇచ్చిన 25 కోట్ల రూపాయలు పోయాయి అనుకుంటారని నిరంజన్ కి చెప్పాను. ఆ వెంటనే నాకు ఛార్మి ఫోన్ చేసి మీకు ఏం వచ్చిన సరే ప్రాణం అడ్డుపెట్టి మరి మీకు అండగా నిలబడతాము. మీరు ఇప్పుడు వదిలేస్తే మేము చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదంటూ ఒక గంట సేపు వరకు తమని బ్రతిమలాడారు అంటూ తెలిపారు చైతన్య రెడ్డి. నిరంజన్ కూడా చివరికి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నానని తెలిపింది చైతన్య రెడ్డి(Producer Chaitanya Reddy).

- Advertisement -
Advertisement

నష్టం వచ్చాక ఫోన్ చేస్తే నంబర్ బ్లాక్ చేశారు..

ఆగస్టు 13న అన్ని ఏరియాలను క్లియరెన్స్ వచ్చేసింది. కానీ అదే రోజు రాత్రి ఒక పెద్ద సమస్య ఇంత కడితేనే సీడెడ్ ప్రాంతంలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఈ విషయం ఛార్మికి చెబితే.. మేము సీడెడ్ ఎప్పుడో క్లియర్ చేసాం ఏమైనా ఉంటే చాంబర్లో మాట్లాడుకోవాలంటూ చెప్పిందని ఇక సీడెడ్ లో సినిమా రిలీజ్ కాకపోతే అన్ని ప్రాంతాలలో కూడా పోతుందని భావించాము ఆ సమయంలోనే రూ. 6.5 కోట్ల రూపాయలకి ఎన్నార్ఐ ఒప్పుకున్నాం అది అడ్వాన్స్గా మార్చి ఆగస్టు 14న విడుదల చేసాం.. సినిమా రిలీజ్ అయిన తర్వాత రియల్ చూసి ఫోన్ చేస్తే ఎవరూ కూడా లిఫ్ట్ చేయలేదు.. ఛార్మి కూడా ఇంటికి రానివ్వలేదు. మొబైల్ నెంబర్ బ్లాక్ లో చేసింది.. పూరి జగన్నాథ్ నెంబర్ మార్చేశారు, ఇక నిరంజన్ కూడా రెండుసార్లు ట్రై చేసి ముంబైకి వెళ్లి వచ్చినప్పటికీ సినిమా చేస్తామని చెప్పడం, మా రెమ్యూనరేషన్ 15 కోట్లు మేము చెప్పిన కథ చేయాలి 50% ప్రాపర్టీ ఇస్తామని చెప్పారని తెలిపింది చైతన్య రెడ్డి.

ఛార్మీ పక్కా మోసకారి..

మాకి 35 నుంచి 40 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాము. ఆఖరికి డిస్ట్రిబ్యూషన్ ప్రెషర్ పడలేక పోకిరి సినిమా రిలీజ్ చేస్తే మొత్తం ప్రాపర్టీలో 70% మాకు 30% మీకు ఖర్చులన్నీ మీరే పెట్టుకొని రిలీజ్ చేస్తామంటే చేయండి అంటూ ఛార్మి తెలిపింది అంటూ చైతన్య రెడ్డి చెప్పారు. అసలు ఆ డబ్బులు వస్తాయో రావో మాకు తెలియదు. ఖర్చులు పెట్టుకొని మరి రిలీజ్ చేస్తే.. 70 శాతం ప్రాపర్టీ ఎలా ఇస్తాం ఆరోజు మీరు లేకపోతే మా జీవితం లేదన్న మనిషి ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత.. మాట మార్చేసింది. ఆమె వస్తే ఎమోషనల్ గానే మాట్లాడుతుంది.. వస్తే నువ్వు ఒక్కడివే రా నిరంజన్ అని చెబుతోంది, ప్రతి చెక్కు మీద తన సంతకమే ఉంది. చార్మి నా దగ్గర నుంచి పైసలు తీసుకొని అలా మాట్లాడడం చాలా బాధగా అనిపించింది . నేను ఆరోజు ఒక్క చెక్కు మీద సైన్ చేసి ఉండకపోతే ఆ సినిమా విడుదల అయ్యేది కాదు. అలాంటిది ఈరోజు వరకు మళ్లీ అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. అన్నిట్లో మమ్మల్ని బ్లాక్ చేశారు అంటూ చైతన్య రెడ్డి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మొత్తానికి పూరి జగన్నాథ్ చార్మిల గురించి ఈ విషయాలు బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you