Saturday, September 5, 2026
HomeLATESTSS Rajamouli:హీరోగా కార్తికేయ..జక్కన్న సెన్సేషనల్ డెసీషన్..!

SS Rajamouli:హీరోగా కార్తికేయ..జక్కన్న సెన్సేషనల్ డెసీషన్..!

SS Rajamouli:దర్శకధీరుడు రాజమౌళి కార్తికేయ విషయంలో తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

on
- Advertisement -banner Ad

SS Rajamouli:రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అందరికీ బాగా తెలిసిన పేరే. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉంది అంటే.. కచ్చితంగా దానికి బిగ్గెస్ట్ కారణం రాజమౌళి అని చెబుతూ ఉంటారు జనాలు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన జక్కన్న పేరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న రాజమౌళి.. సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. ఈ సినిమా కోసం రాజమౌళి కష్టపడుతున్నాడు. అదేవిధంగా మహేష్ బాబును కూడా కష్టపెడుతున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో అనుకున్నది సాధించడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాలో కార్తికేయ గురించి ఆసక్తికర వార్త:

ఇలాంటి మూమెంట్‌లోనే రాజమౌళి(SS Rajamouli) కొడుకు కార్తికేయకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కార్తికేయ పేరు ఎంతలా హాట్ టాపిక్‌గా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

కార్తికేయ మొదటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాడు. జక్కన్నతో కలిసి ప్రతి సినిమాకు వర్క్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అన్నది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా మారి తనదైన స్టైల్‌లో ముందుకు వెళుతూ వచ్చాడు.

- Advertisement -
Advertisement

also read:Dragon movie:ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్!

హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించిన కార్తికేయ:

అయితే కార్తికేయ గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. కార్తికేయ కెరీర్ బిగినింగ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా ట్రై చేశాడట. అంతేకాదు, ఓ సినిమాను ఓకే చేసి.. ఆ సినిమా షూటింగ్ కూడా ఒక షెడ్యూల్ వరకు పూర్తిచేశారట.

- Advertisement -
Advertisement

అయితే రాజమౌళి మాత్రం ఆ సినిమా షూటింగ్ చూసిన తర్వాత.. కార్తికేయకు హీరో కంటే కూడా నిర్మాణ బాధ్యతలే బాగా సూట్ అవుతాయని భావించాడట. దీంతో ఆ సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక క్యాన్సిల్ చేసేశాడట. అది కూడా ఓ టాలెంటెడ్ డైరెక్టర్‌తో అంటూ టాక్ బయటకు వచ్చింది. అంతేకాదు, కార్తికేయ కూడా రాజమౌళి చెప్పిన దానికి కట్టుబడి అలానే చేశాడట. రాజమౌళికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎవరికి ఏది సూట్ అవుతుందో ఆయనకు బాగా తెలుసు. తన కొడుకు విషయంలో కూడా అలాగే చేశాడు.

also read:Nayanthara: వైట్ చుడీదార్ లో చక్కగా ఆకట్టుకుంటున్న నయనతార!

కొడుకును నిర్మాతగా మార్చిన రాజమౌళి :

తన కొడుక్కి హీరోగా కంటే కూడా బిజినెస్ రంగం వైపే ఎక్కువగా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఆలోచించి.. నిర్మాతగా రంగంలోకి దింపారు. ఇప్పుడు కార్తికేయ ఎంత టాప్‌మోస్ట్ సెలబ్రిటీగా మారిపోయాడో అందరికీ తెలిసిందే. క్షణం కూడా తీరిక లేకుండా తనదైన స్టైల్‌లో సినిమాలను నిర్మిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు కార్తికేయ. ఒకపక్క నాన్న కోసం నాన్న సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ.. మరోపక్క తన కెరీర్ కోసం తన సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నాడు.

రాజమౌళి నిర్ణయంపై ప్రశంసలు:

కార్తికేయ లైఫ్ ఇప్పుడు ఈ విధంగా వెలిగిపోతుంది అంటే.. దానికి కారణం రాజమౌళి తీసుకున్న నిర్ణయమే అని, రాజమౌళి పర్ఫెక్ట్ డైరెక్టర్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you