Sunday, August 2, 2026
HomeLATESTRana:రానా కొత్త ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్.. ఇంతగా మారిపోవడానికి కారణమేంటి?

Rana:రానా కొత్త ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్.. ఇంతగా మారిపోవడానికి కారణమేంటి?

Rana:రానా దగ్గుబాటి తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి సన్నని లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

on
- Advertisement -banner Ad

Rana:”రానా దగ్గుబాటి”.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా అనగానే హీరో ప్రభాస్ తో పాటు భల్లాలదేవుడి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన “రానా దగ్గుబాటి” కూడా ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేస్తాడు. హీరోగా తక్కువ సినిమాలో చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2010లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “లీడర్” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రానా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అనంతరం హిందీలో “ధమ్ మారో ధమ్” సినిమాలో నటించి బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

బాహుబలి తో దేశవ్యాప్త గుర్తింపు:

2011లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “నేను నా రాక్షసి” లో కనిపించిన రానా(
Rana) , తర్వాత యే జవానీ హై దివానీ, బేబీ వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆయన కెరీర్‌లో అతిపెద్ద మలుపు 2015లో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్. ఇందులో భల్లాలదేవుడి పాత్రను అద్భుతంగా పోషించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. బాహుబలి : ది కంక్లూజన్ తో ఆ పాత్రకు మరింత గుర్తింపు లభించింది. ప్రభాస్ తో సమానంగా రానా నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Ramayana:రామాయణ ట్రైలర్‌లో మెరిసిన సురభి దాస్ ఎవరు?

వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక స్థానం :

బాహుబలి తర్వాత “నేనే రాజు నేనే మంత్రి, ఘాజీ” వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తన నటనలోని మరో కోణాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ తో కలిసి “భీంలా నాయక్” లో కీలక పాత్రలో నటించగా “విరాటపర్వం” వంటి చిత్రాలలో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం బాహుబలి: ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ సిరీస్ పనుల్లో రానా బిజీగా ఉన్నారు.

- Advertisement -
Advertisement

also read:Jabardasth:కెమెరా ముందు నవ్వులు.. కానీ జీవితంలో కష్టాలు: జబర్ధస్త్ తన్మయ్ ఎమోషనల్ స్టోరీ..!

వైరల్ అవుతున్న కొత్త లుక్:

ఇటీవల రానా దగ్గుబాటికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ చిత్రంలో ఆయన గతంతో పోలిస్తే చాలా సన్నగా, బక్క్చిక్కుపోయినట్లు కనిపిస్తున్నారు. రానాకు ఆరోగ్య సమస్యల అంటూ నెటిజెన్స్ సైతం ఈ ఫోటోలకి కామెంట్స్ పెడుతున్నారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు భల్లాల దేవుడిగా ఎంతో దృఢంగా కనిపించిన రానా ఇలా మారిపోయారు ఏంటి..? అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. క్యాప్ ధరించి క్యాజువల్ టీషర్టులో గడ్డం లేకుండా వత్తైన మీసంతో కనిపించిన ఈ లుక్ కొత్త సినిమా కోసం చేసిన మేకోవరై ఉండొచ్చు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై రానా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు . అయినప్పటికీ తాజా లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you