Ramayana:పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న “రామాయణం” సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ మైథాలజికల్ డ్రామాలో రన్బీర్ కపూర్ శ్రీరాముడిగా , రావణుడిగా యష్, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది.
ట్రైలర్ లో కనిపించిన యువతిపై ఆసక్తి :
ట్రైలర్ లో సాయి పల్లవి వెనుక కనిపించిన ఓ యువతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఎవరు..? ఈ సినిమాలో ఏ పాత్ర పోషిస్తుంది..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో నటిజెన్లు ఆమె గురించి పెద్ద ఎత్తున గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపెట్టేశారు. ఆ యువతి పేరు “సురభి దాస్”. ఈ చిత్రంలో ఆమె శ్రుతకీర్తి పాత్రలో కనిపించబోతున్నారు. శ్రుతకీర్తి అంటే సీతాదేవి చిన్న చెల్లెలు. శత్రుఘ్నుడి భార్య. గతంలోనే తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని సురభి స్పష్టం చేశారు. తాను ఊర్మిళా పాత్రలో కాదని శ్రుతకీర్తి పాత్రనే పోషిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇది తన కెరియర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని పేర్కొంటూ ఈ సినిమాలో భాగం కావడం తనకు గర్వకారణం అని చెప్పారు. ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా నిర్వహించిన ఆడిషన్స్ ద్వారా ఈ అవకాశం దక్కింది అని వెల్లడించారు.
also read:Jabardasth:కెమెరా ముందు నవ్వులు.. కానీ జీవితంలో కష్టాలు: జబర్ధస్త్ తన్మయ్ ఎమోషనల్ స్టోరీ..!
అస్సాం నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణం:
సురభి దాస్ అస్సామీ చిత్ర పరిశ్రమలో నటిగా తన కెరియర్ ప్రారంభించారు. అనంతరం హిందీ టెలివిజన్లో అడుగుపెట్టి “నీమా డెంజోంగ్పా” అనే సీరియల్ లో హీరోయిన్గా గుర్తింపు పొందా.రు తర్వాత స్టార్ ప్లస్ లో ప్రసారమైన ‘పాండ్యా స్టోర్’ సీరియల్ లో కీలక పాత్ర పోషించి మరింత ప్రజాదరణ సంపాదించారు. ఇప్పుడు రామాయణం(Ramayana) వంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో శ్రుతకీర్తి పాత్రలో “సురభి దాస్” కనిపించబోతూ ఉండడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఆమెపై పెరిగిన ఆసక్తి.. సినిమా విడుదలయ్యే సమయానికి మరింత పరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..
also read:Rashmika mandanna:హీరోయిన్ రష్మికకు గాయం..ఆందోళనలో ఫాన్స్
https://www.instagram.com/reel/DLoznxRt-cs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==




