పదహారణాల పడుచందం రుక్మిణి వసంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను ఆకర్షించే ఈమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలతో అభిమానులను అలరిస్తోంది.
అందులో భాగంగానే తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ధరించిన ఈమె చీరను తలపించేలా వేసుకున్న ఈ కొత్త డ్రెస్సు ఈమె అందాన్ని మరింత పెంచేసింది.
సెగలు పుట్టించేలా అందంతో కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది రుక్మిణి వసంత్.
రుక్మిణి వసంత్ సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పరదేశి సినిమాతో తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. కాంతారా చాప్టర్ వన్ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకుంది.
ఇక ఇప్పుడు టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతోపాటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.